170 కాదు.. 203 మంది గల్లంతు
ఆకస్మిక వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. 11 మంది మృతులు సహా 203 మంది గల్లంతైనట్లు తెలిపారు. మరో టన్నెల్లో 35మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆదివారం వరకు తపోవన్ ప్రాజెక్టుపై అవగాహన లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎంఎస్పీ ఉంది
కనీస మద్దతు ధరకు ఎలాంటి ఢోకా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ వేదికగా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర ప్రస్తుతం ఉందని, ఇకపైనా కొనసాగుతుందని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చొరబాటుదారుడు హతం
జమ్ములోని భారత్-పాక్ సరిహద్దులో ఓ చొరబాటుదారుణ్ని సరిహద్దు బలగాలు కాల్చి చంపాయి. సాంబా సెక్టార్‌లోని చాక్ ఫకీరా సరిహద్దు పోస్టు వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సరిహద్దుకే పరిమితం
పాకిస్థాన్ క్రూరమైన చర్యలను భారత్ బలగాలు దీటుగా తిప్పుకొడుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత బలగాలు పాక్ చర్యలను సరిహద్దుకే పరిమితం చేశాయన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు రాజ్‌నాథ్ సింగ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాజ్‌భవన్ అన్నం
రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో 'రాజ్‌భవన్ అన్నం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ప్రారంభించారు. రాజ్‌భవన్ పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్న గవర్నర్... విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులను పేరుపేరునా పలకరించి నిత్యం అల్పాహారం తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి