తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Feb 8, 2021, 11:00 AM IST

  • రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. 50 మందికి పైగా ఎంపీలు తమ అభిప్రాయాలు పంచుకున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భూటాన్​ ప్రధాని దిగ్భ్రాంతి

ఉత్తరాఖండ్​ వరదలపై విచారం వ్యక్తం చేశారు భూటాన్​ ప్రధాని లొటాయ్​ షేరింగ్. ఈక్రమంలో మాట్లాడిన షేరింగ్​ "వరదల్లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. గల్లంతైనవారు సురక్షితంగా బయటపడాలని ఆశిస్తున్నా. మిత్ర దేశం.. భారత్​కు అండగా ఉంటాం" అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్​కు అండగా ఉంటాం

ధౌలీగంగా జల ప్రళయంపై స్పందించారు ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో‌ గుటెర్రస్. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. ఈ సమయంలో భారత్​కు అండగా ఉంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 11,831

దేశంలో కొత్తగా 11,831 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 1కోటి 8లక్షల 38 వేలు దాటింది. వైరస్​ సోకిన వారిలో మరో 11,904 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 101

తెలంగాణలో మరో 101 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్​తో ఒకరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,611కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నో రియాక్షన్

రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారం చేస్తోన్న ట్విట్టర్​ ఖాతాలను నిలిపివేయాలంటూ కేంద్రం జారీ చేసిన నోటీసులపై ఆ సంస్థ స్పందించడం లేదు. ఈ క్రమంలో ట్విట్టర్​ తీరుపై కేంద్రం ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చెన్నైకి శశికళ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ.. బెంగళూరు నుంచి చెన్నైకు సోమవారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో చెన్నైలో శశికళకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు ఏఎంఎంకే నేతలు, అభిమానులు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు నుంచి దారిపొడవునా బ్యానర్లు కట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బుల్​ దూకుడు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 530 పాయింట్లలకు పైగా పెరిగి.. ప్రస్తుతం 51 వేల 263 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 28 పాయింట్లకుపైగా లాభంతో 14వేల 924 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వరద బాధితులకు పంత్​ విరాళం

ఉత్తరాఖండ్​ వరద సహాయక చర్యల కోసం తన మ్యాచ్​ ఫీజును సాయంగా ఇస్తానని తెలిపాడు యువ క్రికెటర్​ రిషభ్​పంత్​. ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నన్నలా పెంచలేదు బాస్

ఓ నెటిజన్ తనపై కామెంట్ చేయగా దానిపై మడిపడింది యాంకర్ అనసూయ. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదంటూ బదులిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details