- హైస్కూల్లో మంటలు..
హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస హైస్కూల్ ఆఫీస్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రుణయాప్‌లు బ్లాక్..
రుణ యాప్‌ల నిర్వాహకుల ఆటలు కట్టించేలా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లోన్ యాప్‌లు బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. యాప్‌ల తొలగింపునకు ప్లేస్టోర్లను సంప్రదించాలని డీజీపీకి హైకోర్టు నిర్దేశం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇదే మార్చుకోవాలి..
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విపక్షాలు తప్పుపట్టాయి. రైతులపై గెలిచేందుకు కందకాలు తవ్వటం, ముళ్ల తీగలు వేయటం వంటివి ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భావనను మార్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చౌరీ చౌరా శతాబ్ది వేడుకలు..
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆ వాహనాలిక తుక్కుకే!
కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేలా పాలసీని తీసుకొస్తామన్న కేంద్ర ప్రకటనపై రాష్ట్ర రవాణా శాఖ దృష్టి సారించింది. కాలుష్య నియంత్రణకు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలని పేర్కొనటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కోవలోకి వచ్చే వాహనాలెన్ని అని లెక్కలు సేకరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆధార్ ఉంటేనే పెళ్లి..