తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Feb 1, 2021, 11:00 AM IST

  • బడ్జెట్​కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్​.. బడ్జెట్​కు ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో బడ్జెట్​ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నిర్మల నయా ట్రెండ్​

2021-22 బడ్జెట్​ ప్రవేశపెట్టే క్రమంలో మరో కొత్త సంప్రదాయానికి తెరతీశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ప్రతుల ముద్రణ లేనందున.. ఎర్రటి పౌచ్​లో ట్యాబ్​తో పార్లమెంట్​కు చేరుకున్నారు. డిజిటల్​ పద్ధతిలోనే బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బడ్జెట్​ ప్రత్యేక యాప్​ ఫీచర్లు ఇవే..

కరోనా నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ ప్రతులు ముద్రించలేదు ఆర్థిక శాఖ. సామాన్యులు బడ్జెట్ వివరాలు సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్​ను తీసుకొచ్చింది. ఆ యాప్ ఎలా వాడాలి? ఎలాంటి సమాచారం యాప్​ నుంచి పొందొచ్చు? అనే వివరాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బడ్జెట్​పై ఆశలతో మార్కెట్ల జోరు

పార్లమెంటులో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుసగా నష్టాలు నమోదు చేసిన సూచీలు.. బడ్జెట్​ నేపథ్యంలో సోమవారం సానుకూలంగా స్పందిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మురిసిన బడి

రాష్ట్రంలో బడిగంట మోగింది. పది నెలల విరామం అనంతరం విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. కరోనా పరిస్థితులతో మార్చిలో మూతపడిన పాఠశాలలు, కళాశాలలు... ఎట్టకేలకు తెరుచుకున్నాయి. విద్యార్థులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మూడేళ్ల బాలికపై అత్యాచారం

ఇంట్లో ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ పాశవిక చర్య కర్ణాటక బీదర్​ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 11,427

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 11,427 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 57వేలకు పెరిగింది. ఒక్కరోజులోనే 11,858 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 118

రాష్ట్రంలో కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 118 వైరస్​ కేసులు బయటపడ్డాయి. ఇద్దరు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఊపిరితిత్తుల కణాలపై కరోనా దెబ్బ

కరోనా వల్ల.. కొద్ది గంటల్లోనే ఊపిరితిత్తుల కణాలు దెబ్బతింటాయని అమెరికన్​ పరిశోధకులు కనుగొన్నారు. కరోనా కోసం కొత్తరకం మందులను తయారుచేయడంలో ఇది సహకరిస్తుందని చెప్పారు బోస్టన్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హర్భజన్ రికార్డుపై అశ్విన్ కన్ను

టీమ్ఇండియా బౌలర్ రవి అశ్విన్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో మరో 12 వికెట్లు తీస్తే భజ్జీని వెనక్కి నెట్టేస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details