తెలంగాణ

telangana

By

Published : Jan 31, 2021, 10:59 AM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @11AM

  • పోరు ఉద్ధృతం

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతుల మరింత ఉద్ధృతంగా మారుతోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు రహదారులపై బైఠాయించారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపేసే ప్రతిపాదనకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని ప్రకటించినా.. రైతులు ఆందోళన పంథాను వీడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రైతు గుండె చప్పుడు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో ప్రధానంగా వినిపిస్తున్నపేరు రాకేశ్​ టికాయిత్​. ఆయన ఒక్క పిలుపు.. అనేక మందిని ఏకం చేస్తోంది. ట్రాక్టర్​ ర్యాలీ పరిణామాల తర్వాత ఇక ఉద్యమం ఆగిపోయిందనుకున్న దశలో టికాయిత్​​ మాటలు ఎందరినో ప్రభావితం చేశాయి. మళ్లీ పోరుకు పునరుజ్జీవం తెచ్చాయి. ఇంతకీ రైతు నాయకుడి ప్రస్థానం ఎలా మొదలైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 13,052

దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 13,052 వైరస్​ కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 46వేలకు పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 96.99 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 163

తెలంగాణలో తాజాగా మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో వైరస్ సోకి ఇప్పటివరకు 1,599 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పరిహారమేది..?

ప్రాజెక్టుల కోసం సర్వం కోల్పోతున్నా... సర్కార్‌కు పట్టడంలేదు. సర్వేలు జరిపి ఏళ్లు గడుస్తున్నా... పరిహారం మాత్రం అందడంలేదు. ముంపు కింద ఉండలేక... పునరావాసానికి వెళ్లే స్థోమత లేక... నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. జలాశయాలు నిండినప్పుడే హడావిడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు అనంతరం... అటువైపు కన్నెత్తైనా చూడటంలేదు. వనపర్తి జిల్లాలో భీమా రెండోదశలో భాగంగా నిర్మించిన శంకరసముద్రం, రంగ సముద్రం నిర్వాసితుల కష్టాలపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఊరికో.. ఉద్యానం

పార్కులంటే నగరాలు, పట్టణాలకే పరిమితం.. జిమ్‌కు వెళ్లాలంటే పురప్రాంతాల్లోనే.. మార్నింగ్‌ వాక్‌ పట్టణ, నగరవాసులకే.. అన్న భావనను పల్లెప్రకృతి వనాలు మార్చేస్తున్నాయి. వీటి ఏర్పాటుతో.... పల్లె జనాలు సైతం ఉదయపు నడకకు వెళుతున్నారు. పార్కుల్లో పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. అది కూడా ఇంటికి దగ్గర్లోనే. ఇన్ని ఏర్పాట్లు, వసతులు.. అదీ ఎకరా విస్తీర్ణంలోనే సమకూరుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పచ్చని పార్కు

రాష్ట్రవ్యాప్తంగా పార్కుల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో పచ్చదనం అంతకంతకూ తగ్గిపోతుండటంతో... పార్కులను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కాసేపు ఆహ్లాదంగా గడిపేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బంగ్లాకు ముక్తినిచ్చి!

పాకిస్థాన్​ నుంచి తూర్పు పాకిస్థాన్‌(ఇప్పటి బంగ్లాదేశ్)కు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు రిటైర్డ్‌ కర్నల్​‌ ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌. బంగ్లా ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషికి గానూ.. ఇటీవలే ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కర్నల్‌ ఖాజీ జహీర్‌ గురించి తెలుసుకుందాం..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గుండు కొట్టించుకున్న నట్టూ​

భారత యువ బౌలర్​ తంగరసు నటరాజన్.. ​పళనిలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాడు. స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నాడు నట్టూ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏజెంట్​గా సంతానం

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' తమిళ రీమేక్​ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు 'సంతానం' ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మనోజ్‌ బీద దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details