తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్​ @ 11AM

By

Published : Jan 30, 2021, 10:59 AM IST

  • సత్యానిదే అంతిమ విజయం

సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటిచెప్పిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడికి నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • శాంతియుత మార్గంతోనే దేశానికి మేలు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బాపూజీ జీవిత భావాలను, చేసిన కృషిని స్మరించుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ట్రక్కు-మినీ బస్సు ఢీ

ఉత్తర్​ప్రదేశ్​ మురాదాబాద్​- ఆగ్రా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-మినీ బస్సు ఢీకొన్న ఘటనలో 10మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పక్కా ప్లాన్​తో 'ఎర్రకోట' హింస!

దిల్లీలో జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనలు.. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లుగా తెలుస్తోంది. రైతుల ట్రాక్టర్​ ర్యాలీని ఉద్దేశపూర్వకంగానే అనుమతించిన మార్గంలో కాకుండా ఎర్రకోట వైపు మరల్చారని అధికారులు గుర్తించారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ విషయాలను తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దిల్లీ సరిహద్దులో రైతుల ఉపవాస దీక్ష

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన మహాత్ముడి వర్ధంతి రోజూ కొనసాగుతోంది. ఉద్యమంపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రాకేశ్ టికాయిత్ గురువారం రాత్రి కన్నీరు పెట్టు కోవడం, ఆత్మహత్యకు సిద్ధమని ప్రకటించడం.. రైతుల్ని తీవ్రంగా కదిలించింది. దీంతో సరిహద్దు ప్రాంతాలకు రైతన్నలు మళ్లీ తరలివస్తున్నారు. మరింత ఎక్కువ సంఖ్యలో మునుపటి ఆందోళన ప్రదేశాలకు చేరుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అంకురాల ఆశలు నెరవేరేనా?

కరోనా సంక్షోభం సహా గతంలో ఎన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితుల నడుమ ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. కరోనా వల్ల దేశీయంగా అంకురాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న పద్దుకు అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేతల సూచనలు ఏమిటి? ఎలాంటి ప్రోత్సహాకాలు కావాలని వారు కోరుతున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అందరూ మహిళలే!

ఐరోపాలోని ఎస్తోపియా అరుదైన ఘనత సాధించింది. ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ మహిళలే కావడం విశేషం. అంతే కాదు క్యాబినెట్​లోని మంత్రుల్లో సగానికి పైగా మహిళలే ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనా మూలాలపై శోధన

చైనాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించింది. పర్యటనలో భాగంగా వుహాన్​లో తొలిదశలో కరోనా కేసులు నమోదైన ఆస్పత్రులను సందర్శిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రమాదంలో క్రికెటర్ల కెరీర్లు!

ప్రతిభ ఉన్నా.. తగినన్ని అవకాశాలు దక్కినా.. టీమ్​ఇండియాకు ఎప్పుడూ దూరమవుతున్నారు కొందరు క్రికెటర్లు. ఫిట్​నెస్​ సమస్యలతో గాయాల పాలవుతున్నారు. ఫలితంగా వారి కెరీర్​ ప్రమాదంలో పడుతుంది. అలాంటి జాబితాలో ఎక్కువగా బౌలర్లే ఉండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్' క్యారెక్టర్ పోస్టర్స్

పరిణీతి చోప్రా, అదితీ రావు హైదరి, అవినాష్ తివారీ ప్రధానపాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్'. ఫిబ్రవరి 26న నెట్​ఫ్లిక్స్ వేదికగా విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details