- సెంట్రల్ విస్టాకు గ్రీన్‌సిగ్నల్
కొత్త పార్లమెంట్ సహా ప్రభుత్వ భవనాల ఆధునికీకరణ కోసం కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతులు ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2-1 తేడాతో తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ప్రగతి పరుగు పెడుతుంది..
కేరళ-కర్ణాటక మధ్య నిర్మించిన సహజవాయువు పైపులైన్‌ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశ ఆర్థిక వృద్ధి ఇటీవలి కాలంలో వేగం పుంజుకుందని అన్నారు. అభివృద్ధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కేటీఆర్‌ను సీఎం కాలేడు
కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని... కావాలనే లీకులు ఇస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమన్నారు. రాష్ట్రంలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆగిన మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు కారిడార్లలో రైళ్ల కొంత ఆలస్యంగా నడువగా... మరికొన్ని కారిడార్లలో సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం కారిడార్లలో రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేనెెళ్తే తప్పేంటి
ఏపీలో కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనపై 'భాజపా- జనసేన' తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొత్త దారిలో సాగు