తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - telangana latest updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్ న్యూస్ @11AM

By

Published : Dec 13, 2020, 11:00 AM IST

  • ఎందుకీ తొందర?

ఒక్క నిమిషాం ఆగితే ఐదుగురు ప్రాణాలు మిగిలేవి కానీ వారు ఆ నిమిషం ఆగలేదు. సిగ్నల్​ జంప్​ చేసి వెళ్లారు. మృత్యు ఒడికి చేరారు. రెడ్​ సిగ్నల్​ పడినా ఆగకుండా వెళ్లటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ గచ్చిబౌలిలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 127 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,77,724కు చేరింది. మరో నలుగురు మరణంతో.. మృతిచెందినవారి సంఖ్య 1,493కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేశంలో మరో 30,254 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 30,254 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 391 కొవిడ్​ మరణాలు సంభవించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 15 నిమిషాల్లో ఫలితం!

కొవిడ్​-19ని గుర్తించే సరికొత్త పరీక్ష విధానాన్ని కనుగొన్నారు అమెరికా శాస్త్రవేత్తలు. స్మార్ట్​ఫోన్​ ఆధారంగా లాలాజలాన్ని పరీక్షించి కరోనా ఉనికిని నిర్ధరించారు. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫలితాన్ని వెల్లడిస్తుండటం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేశం రుణపడి ఉంటాం..

పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఘటనలో అమరులైన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 8.98 శాతం పోలింగ్​

జమ్ముకశ్మీర్​లో ఓటింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 8.98 శాతం పోలింగ్​ నమోదైంది. డీడీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు కశ్మీర్ ఓటర్లు. డోడా జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటేసేందుకు క్యూలో నిలబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భూతాపంపై పోరులో ముందంజ

2015 పారిస్​ వాతావరణ సదస్సులో భూతాపాన్ని తగ్గించాలని ప్రకటించినా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా, చైనాలూ ఈ లక్ష్యసాధనలో వెనకబడేఉన్నాయి. భారత్​ ఒక్కటే వాతావరణ వైపరీత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకోసం ఇంధన, రవాణా, పారిశ్రామిక, వ్యర్థాల నిర్మూలన, అటవీ రంగాల్లో తగిన చర్యలు తీసుకొంటోందని 'క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ' సంస్థ నివేదికలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • స్టాక్‌ మార్కెట్లోకి నీరు!!

డబ్బుల్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఇకపై అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి! ఎందుకంటే నీళ్లే ఇప్పుడు డబ్బులుగా మారిపోతున్నాయి. చమురు, బంగారం సరసన నీరు కూడా చేరిపోయింది. వాల్‌స్ట్రీట్‌ ఫ్యూచర్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఒలింపిక్స్​లో బ్రేక్ డ్యాన్స్..

బ్రేక్ డ్యాన్స్.. ఈ పదం దాదాపు అందరికీ సుపరిచితమే. కానీ ఒలింపిక్స్​లో ఈ పోటీలు అనేసరికి అందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ పోటీలు ఎలా సాగుతాయి. ఎలాంటి స్టెప్పులేస్తే పతకం దక్కుతుంది అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అలాంటి వారి కోసమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అంతా ఆనందమే..

తనదైన నటనతో ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్నారు టాలీవుడ్​ సీనియర్​ హీరో వెంకటేష్. ఆదివారం వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details