- దేశంలో 98లక్షల కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 31,522 కేసులు నమోదయ్యాయి. 412 మంది ప్రాణాలు కోల్పోయారు. 37,725 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కరోనా ఊసే లేదక్కడ!
కొద్దిరోజులుగా మానవాళి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో వైరస్ను అదుపులోకి తెచ్చాయి. అదే తరహాలో మన దేశంలోనూ ఓ దీవి నిలిచింది. తొలి కేసుతోనే అప్రమత్తమైన లక్షద్వీప్.. ఇప్పుడు ఏకంగా కరోనా రహిత ద్వీపంగా నిలిచి.. అందరి మన్ననలూ పొందుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,75,904 మంది కొవిడ్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పట్టువీడని రైతన్న
దేశ రాజధాని దిల్లీలో రైతులు తలపెట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఈ నిరసనలు చేపట్టారు. దిల్లీ-హరియాణా సరిహద్దులోని టిక్రి వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మరో ఇద్దరు మృతి
ఏపీలోని ఏలూరు వింతవ్యాధి ఘటనలో మృతులు సంఖ్య మూడుకు చేరింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బుధవారం రాత్రి సుబ్బరావమ్మ(56), చంద్రారావు(50) మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ముప్పు తొలగినా..!