ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర.. Medaram Jatara 2022: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర వైభవంగా ప్రారంభమైంది. మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు.. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ఉద్దవ్ ఠాక్రే మద్దతు..CM KCR Mumbai Tour: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే... సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి ముంబయికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న కేసీఆర్ ముంబయి వెళ్లనున్నారు.మోదీకి మరో అవకాశమిస్తే అంతే.. KTR Comments on Modi : నరేంద్ర మోదీకి ప్రధానిగా మరో అవకాశమిస్తే.. తెలంగాణను ఆంధ్రాను కలుపుతారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అన్నారు. దేశం కోసం ధర్మం అని చెప్పే భాజపా సర్కార్.. దేశానికి ఏం చేస్తుందో మాత్రం చెప్పదని వ్యాఖ్యానించారు. మోదీ కేవలం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర భారత్‌కు మాత్రమే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు..EC notice to Raja Singh: యూపీ ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలతో వీడియో చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన.. COVID-19 restrictions: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున కేంద్రం కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. కొవిడ్ పరిస్థితులను సమీక్షించి ఆంక్షలను ఎత్తివేయాలని లేదా సడలించాలని నిర్దేశించింది.కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ ఉక్రెయిన్'..Indian Embassy In Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.19% తగ్గిన కరోనా కేసులు... WHO New COVID cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంతో పోలిస్తే.. కేసులు 19 శాతం పడిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. మరణాల సంఖ్య స్థిరంగా ఉందని వెల్లడించింది.30 రోజుల్లో కురవాల్సిన వర్షం మూడు గంటల్లోనే..Brazil flood 2022: బ్రెజిల్ రియో డి జెనిరో రాష్ట్రం పెట్రొపొలిస్ నగరాన్ని వరద ముంచెత్తిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. మరెంతో మంది ఆచూకీ గల్లంతు కాగా.. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.ఐపీఎల్ వేలంలో తప్పిదం.. IPL 2022 Auction: ఐపీఎల్ వేలం ప్రక్రియలో ఓ తప్పిదం జరిగినట్లు తాజాగా సోషల్‌మీడియాలో బయటికొచ్చింది. ఆక్షనీర్ పొరబాటు కారణంగా ముంబయి ఇండియన్స్‌కు దక్కాల్సిన పేసర్ ఖలీల్ అహ్మద్‌ను దిల్లీ కొనుగోలు చేసినట్లు తెలిసింది.బీమ్లానాయక్ సందడి షూరూ..Bheemla nayak trailer: 'భీమ్లా నాయక్' టీమ్.. రాబోయే పదిరోజులు ప్రచారంతో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తేదీలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.