ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన.. Union Power Ministry response: భాజపా ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పందించింది. అపోహలు- వాస్తవాలు పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. సౌర విద్యుత్ కొనుగోలుకు ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయట్లేదని కేంద్రం ప్రకటనలో వివరించింది.కేసీఆర్‌కు దేవెగౌడ సంపూర్ణ మద్దతు..Deve Gowda Support to CM KCR: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్వత్రా మద్ధతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ... సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.కిషన్‌రెడ్డికి మాట్లాడే నైతికత ఉందా.. Harish Rao on Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అమరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చింది కాబట్టే కేంద్రమంత్రి అయిన కిషన్‌రావు.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు.ఈనెల 18న జలశక్తి శాఖ కీలక భేటీ..Godavari Kaveri link project: జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ నెల 18న దిల్లీ శ్రమ శక్తి భవన్లో గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరుల శాఖ కార్యదరులు హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.తక్షణమే ఆ దేశం వదిలి వచ్చేయండి.. Indians to leave Ukraine: ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా విద్యార్థులు తక్షణం స్వదేశానికి రావాలని సూచించింది.దాణా స్కామ్ ఐదో కేసులోనూ లాలూ దోషి..Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మరో 36 మందికి మూడేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది సీబీఐ స్పెషల్ కోర్టు.ఉక్రెయిన్ బార్డర్ నుంచి రష్యా వెనక్కి.. Russia vs Ukraine: ఉక్రెయిన్‌లో సరిహద్దు సమీపంలో మోహరించిన దళాలను రష్యా వెనక్కి పిలిచింది. వీరంతా సరిహద్దు నుంచి తమతమ స్థావరాలకు వెళ్తున్నారని తెలిపింది.ఆ పదవుల విభజనలో సెబీ కీలక నిర్ణయం.. SEBI Norms: ఛైర్పర్సన్, ఎండీ పదవులను స్పష్టంగా విభజించాలన్న నిబంధనపై సెబీ కీలక ప్రకటన చేసింది. 2022 ఏప్రిల్ నాటికి రెండు పదవుల్లో ఉండే వ్యక్తుల బాధ్యతలను వెల్లడించాలని ఇదివరకు చెప్పిన సెబీ.. అయితే ఇది తప్పనిసరి కాదని తాజాగా పేర్కొంది.ఈ ప్లేయర్స్‌కు ఎందుకింత ధర.. IPL 2022 Mega auction: ఈ సారి మెగావేలంలో చాలా మంది ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ వారెవరు? వారిని ఏ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది వంటి విషయాలను తెలుసుకుందాం..కొత్త సినిమా ముచ్చట్లు వచ్చేశాయి..Cinema updates: 'పెళ్లిసందడి' హీరోయిన్ శ్రీలీల ప్రభాస్‌తో కలిసి నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, మెగాహీరో రామ్‌చరణ్ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించనున్నట్లు సినీవర్గాలు సమాచారం.