తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్‌ న్యూస్ 7PM - 7PM టాప్‌ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Sep 4, 2022, 6:58 PM IST

  • డివైడర్​ను ఢీకొట్టిన కారు.. టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ మిస్త్రీ కన్నుమూత

టాటా సన్స్​ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త​ సైరస్​ మిస్త్రీ(54) కన్నుమూశారు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అహ్మదాబాద్​ నుంచి ముంబయి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్​ కారు డివైడర్​ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • ఫోన్​లో గేమ్​ ఆడుతూ చనిపోయిన బాలుడు.. అసలేమైందంటే?

ఫోన్​లో గేమ్​ ఆడి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. పాము కాటు వేస్తున్నా పట్టించుకోకుండా ఫోన్​లో ఫ్రీ ఫైర్​ ఆడుతున్నాడు. పాము కాటేసే సమయంలో అతడు అలాగే గేమ్​ కొనసాగించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని చందన్​నగర్​లో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

  • రీల్స్​ చేయబోయాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు టిక్​టాక్​ చేయబోయి ఆసుపత్రి పాలయ్యాడు. వడ్డేపల్లికి చెందిన అజయ్‌ అనే యువకుడు ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్​ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్​ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్​ను ఢీకొట్టింది.

  • రాగల 3 రోజులు భారీ వర్షాలున్నాయ్​.. బీ అలర్ట్​..

రాగల 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • కేంద్రమంత్రి గారు.. మోదీ సర్కార్ చేసిన అప్పుల సంగతేంటి..?

ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రం అప్పులపై కూడా స్పందించాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

  • అంబర్​పేట నారాయణ కళాశాల​ ఘటనలో ఒకరు మృతి

ఇటీవల హైదరాబాద్​లోని నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇవాళ ఒకరు మృతి చెందారు. అపోలో డీఆర్​డీవోలో ఏవో అశోక్​రెడ్డి చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • పదవీ విరమణలో తోడుగా.. ప్రవాసులు మదుపు చేయండిలా..

విదేశాలలో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ప్రవాసులు ఆసక్తి చూపిస్తుంటారు. రిటైర్మెంట్​ అనంతరం ఉపయోగపడేలా మదుపు చేసుకోవడానికి అనువైన పాలసీల కోసం చూస్తారు. అయితే దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టినప్పుడు, బీమా పాలసీలు తీసుకునేటప్పుడు ఎన్అర్​ఐలు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకుందాం.

  • పాత బైక్​లపై ఎమ్మెల్యే ఆసక్తి.. 70 ఏళ్ల క్రితం నాటి వాహనాలు భద్రంగా..

ఒక్కొక్కరు ఒక్కో అభిరుచిని కలిగి ఉంటారు. అలాగే పంజాబ్​.. పశ్చిమ లుధియానాకు చెందిన ఆప్​ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగికి బైక్​లపై విపరీతమైన ఆసక్తి ఉంది. అందుకే పాతకాలం నాటి బైక్​లను, కారును ఇప్పటికీ భద్రంగా కాపాడుకుంటున్నారు. ఇప్పటికీ తన తండ్రి కొనిచ్చిన బైక్​పైనే నామినేషన్ వేసేందుకు వెళ్తారు. ఆ బైక్​ను శుభసూచికంగా భావిస్తారు గురుప్రీత్.

  • క్యాన్సర్​ వస్తే మరణం తప్పదా.. ఇది ఎంతవరకు నిజం?

క్యాన్సర్​ వచ్చిందంటే చాలు మరణం తప్పదని భావిస్తారు. అయితే ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన చాలా రకాల క్యాన్సర్లకు ఉత్తమ చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్‌తో మరణమనేది ప్రజలకున్న అపోహ మాత్రమే అని.. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • 'బ్రహ్మాస్త్ర' మేకింగ్​ వీడియో విడుదల.. తెర వెనక కష్టమిదీ

భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కలిసి నటించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details