తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Sep 4, 2022, 2:59 PM IST

  • నిమ్స్​లో కు.ని బాధితులకు గవర్నర్ పరామర్శ..

ఆపరేషన్‌లు అధికంగా చేయాలనే లక్ష్యంతో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదు అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందతున్న ఇబ్రహీంపట్నం కు.ని బాధితులను పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న 11 మంది బాధితులకు గవర్నర్ ఆర్థిక సాయం ప్రకటించారు.

  • డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: హరీశ్​రావు

డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి చుట్టూ ఇంటి లోపల నీటి నిల్వలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • అర్ధరాత్రి వీఆర్ఏ ఆత్మహత్య.. అదే కారణమా..!

కామారెడ్డి జిల్లాలో వీఆర్​ఏ ఆత్మహత్యతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న తోటి వీఆర్​ఏలు రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పే స్కేల్​ అమలు చేయకపోవడం వల్లే గ్రామ రెవెన్యూ సహాయకుడు అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

  • 'కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. వారు మాత్రం ట్వీట్లకే పరిమితం.. అందుకే ఇలా..'

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. పరోక్షంగా ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. తనను అగౌరపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ట్వీట్లకే పరిమితమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై ప్రకటన చేశారు.

  • ఇస్రో కోసం రాకెట్ల తయారీ.. రూ.860 కోట్ల కాంట్రాక్టు ఎవరికి దక్కిందంటే?

ఇస్రో కోసం పీఎస్ఎల్​వీ వాహక నౌకలను తయారు చేసే కాంట్రాక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎల్ అండ్ టీ కన్సార్టియం దక్కించుకుంది. ఇకపై ఈ కన్సార్టియం.. పీఎస్ఎల్​వీ రాకెట్లను తయారుచేసి, బిగించి, ప్రయోగానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయని అధికారులు తెలిపారు.

  • తెలుగు వ్యక్తికి అమెరికన్ యూనివర్సిటీ 'శతాబ్ది పురస్కారం'

అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన జార్జిటౌన్ యూనివర్సిటీ శతాబ్ది పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు. ఆయనే రాజా కార్తికేయ గుండు. ప్రస్తుతం ఆయన ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.

  • లండన్​లో అదృశ్యమైన కారు పాక్​లో ప్రత్యక్షం.. ఎలా గుర్తించారంటే?

రూ.2.30 కోట్లు విలువ చేసే బెెంట్లీ కారును దొంగిలించారు దుండగులు. లండన్​లో దొంగతనానికి గురైన కారు పాకిస్థాన్​లో ప్రత్యక్షమైంది. ఈ కారును ఎలా గుర్తించారంటే?

  • 'భారత్ పెద్ద దేశం.. రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు'

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా.. భారత్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్​కు సమస్యాత్మకంగా మారారని అన్నారు. తమ సమస్యను భారత్‌ పరిష్కరించగలదని అభిప్రాయపడ్డారు.

  • స్టార్​ క్రికెటర్​ సంచలన నిర్ణయం..​

బంగ్లాదేశ్​ స్టార్​ క్రికెటర్​ ముష్ఫికర్​ రహీమ్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్​ ఫార్మాట్​లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు.

  • 'లైగర్‌' మూవీ ఎఫెక్ట్‌.. నిర్మాత ఛార్మి షాకింగ్‌ నిర్ణయం!

బాక్సాఫీస్ వద్ద 'లైగర్‌' సినిమా పరాజయంతో చిత్ర నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details