తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana top news 3పీఎం టాప్​న్యూస్ - 3పీఎం టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Aug 27, 2022, 2:59 PM IST

  • ఆ రాష్ట్రాల రైతులతో సీఎం కేసీఆర్ సదస్సు

వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో​ సమావేశమయ్యారు. సాగు నీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు, అనుబంధ రంగాల పురోగతిపై సమావేశంలో చర్చిస్తున్నారు.

  • ముగిసిన బండి సంజయ్​ పాదయాత్ర

వరంగల్ జిల్లాలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపుదశకు చేరుకుంది. బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రారంభమైన యాత్ర మామునూరు మీదుగా వరంగల్ సభాస్థలికి చేరువైంది.

  • చోరి చేసిన ఇంటిని తగలబెట్టిన దొంగలు, ఎందుకంటే

సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ అల్వాల్‌లోని ప్రెసిడెన్సీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. తండ్రి సంవత్సరీకం కోసం దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లిన బంగారు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చోరబడి, నగదును అపహరించారు. అనంతరం ఇంట్లో కారంపొడి జల్లి, నిప్పంటించి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • అందుబాటులోకి చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్

హైదరాబాద్ నగరవాసులకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పైవంతెనను హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ లాంఛనంగా ప్రారంభించారు.

  • 27 ఏళ్లు జైలు శిక్ష, రూ 171 కోట్లు ఫైన్​

పాజీ ఫోరెక్స్​ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు 27 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ 171కోట్ల ఫైన్​ను విధించింది న్యాయస్థానం. రూ 930 కోట్ల ప్రజల పెట్టుబడులను తిరిగి ఇవ్వనందున కోర్టు వారికి ఈ శిక్షను విధించింది.

  • ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష, లోదుస్తుల వివాదంతోనే

కేరళలో నీట్‌ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయిలకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

  • అంతా చూస్తుండగానే కూలిన ఇల్లు, 50 అడుగుల మేర గుంత

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. అంతా చూస్తుండగానే ఓ ఇల్లు అకస్మాత్తుగా కూలి 50 అడుగుల గుంత ఏర్పడింది. చంద్రాపుర్‌ జిల్లాలోని ఘుఘ్గస్​ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బ్రిటీష్‌ కాలంలో అక్కడ భూగర్భ బొగ్గుగని ఉండేదని.. 1985లో దాన్ని ఉపరితల బొగ్గు గనిగా మార్చారని స్థానికులు చెప్పారు.

  • ఈ అద్భుతాలు తెలుసా

క్రికెట్‌ అభిమానులకు మరి కొన్ని గంటల్లో క్రికెట్‌ పండగ మొదలవనుంది. ఆసియా కప్‌ 2022 ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టీమ్​ఇండియా పాకిస్థాన్​ పోరు చూసే అదృష్టం దక్కింది.

  • కోహ్లీ ఆవేదన, మానసికంగా కుంగిపోయి అప్పటినుంచి బ్యాట్‌ పట్టలేదంటూ

మానసికంగా కుంగిపోయనని అన్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కొద్ది రోజుల పాటు బ్యాట్​ పట్టలేదు అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే.

  • ఘనంగా కమెడియన్​ ఆలీ కూతురు నిశ్చితార్థం, వీడియో చూశారా

టాలీవుడ్​ కమెడియన్​ ఆలీ కూతురు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆలీ బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details