తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana top news 3పీఎం టాప్​న్యూస్ - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Aug 26, 2022, 2:59 PM IST

Updated : Aug 27, 2022, 2:58 PM IST

  • పోలీసుల నిఘా నీడలో పాతబస్తీ

వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీసుల అరెస్టులు, పోటాపోటీ నిరసనల వేళ హైదరాబాద్‌ పాతబస్తీ నిఘా నీడలో కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడుగడుగునా ర్యాపిడ్ యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం ముస్లింల ప్రార్థనల దృష్ట్యా అదనపు బలగాలతో ప్రత్యేక నిఘాతో పర్యవేక్షిస్తున్నారు.

  • బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్

బండి సంజయ్‌ పాదయాత్ర ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. పాదయాత్ర ఆపాలని పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి నిన్న సస్పెండ్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. అయితే.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది.

  • ఈ చిన్నారుల డ్యాన్స్​కు కేటీఆర్​ ఫిదా

కేటీఆర్ ట్విటర్​లో వైరల్​ అవుతున్న ఓ వీడియోను ట్విటర్​లో పంచుకున్నారు. ఆ వీడియో చూస్తే కచ్చితంగా మీ ముఖాల్లో చిరునవ్వు విరబూస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఈ పిల్లలు అద్భుతమైన డ్యాన్సర్లు అంటూ ప్రశంసించారు.

  • కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై కేటీఆర్ స్పందన

కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్​లో స్పందించారు. జాతీయపై ఎక్కువగా మాట్లాడే పార్టీ తీసుకున్న అవమానకర నిర్ణయమని ఆయన ట్వీట్​లో వ్యాఖ్యానించారు. సీనియర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలను ఆర్థికభారంగా చూడరాదని పేర్కొన్నారు.

  • ఆజాద్​ రాజీనామా దురదృష్టకరమన్న కాంగ్రెస్, భాజపా వెల్​కమ్​

సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాపై విచారం వ్యక్తం చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే, ఆయన రాసిన లేఖలోని విషయాలు వాస్తవం కాదని అభిప్రాయపడింది. మరోవైపు, తన పార్టీలో చేరారని ఆజాద్​ను కోరారు భాజపా నేత ఒకరు.

  • ఒక చేతిలో కుమారుడు, మరో చేత్తో రిక్షా సవారీ

పొట్టకూటి కోసం తెలియని ప్రాంతానికి వచ్చాడు ఆ యువకుడు. అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఇటీవల అతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఇక ఇద్దరి పిల్లల బాధ్యత అతడిపైనే పడింది.

  • ప్రేమను నిరాకరించారని మనస్తాపం, వివాహిత ఆత్మహత్య

తన ప్రేమను నిరాకరించారనే బాధతో ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన మూడు నెలలకే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రేమను ప్రియుడి ఇంట్లో కాదన్నారని మృతిచెందిదని పోలీసులు నిర్ధరించారు.

  • ధోనీపై కోహ్లీ ట్వీట్​, ఆ నెంబర్స్​ వెనక అర్థం ఏమిటో

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ, రెండు నెంబర్స్​ను ఉపయోగిస్తూ ధోనీపై ఓ ట్వీట్​ చేశాడు. ప్రస్తుతం అది సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

  • ఆ కామెంట్స్ చేస్తే ఎవరినీ వదలనని అనసూయ వార్నింగ్

ఈటీవీలో వచ్చే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటి, వ్యాఖ్యాత అనసూయ.. తన జీవితం, కెరీర్​కు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పింది. తనపై అసభ్య కామెంట్స్​ చేసే వారిలో ఏ ఒక్కరినీ వదలనని హెచ్చరించింది.

  • హీరో నిఖిల్​ ఆవేదన, ఆయనలేకే ఈ కష్టాలంటూ

'సినీ పరిశ్రమలో నాకంటూ ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే ఇబ్బందులు పడేవాడిని కాదు' అని అన్నారు హీరో నిఖిల్‌. తన కష్టాలను చెప్పుకుని ఆవేదన చెందారు.

Last Updated : Aug 27, 2022, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details