తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 7PM - 7PM టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Aug 19, 2022, 6:59 PM IST

  • అమెరికా వీసా కావాలంటే ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. పర్యటక వీసా కావాలంటే దాదాపు ఏడాదిన్నరకుపైగా వేచి ఉండాలి. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగం దరఖాస్తులకు 2024 మార్చి లేదా ఏప్రిల్‌లోనే వీసా అపాయింట్‌మెంట్‌ లభించే అవకాశం ఉంది.

  • అన్నీ గుర్తుంచుకుంటున్నాం, కేసీఆర్‌కు ఈటల వార్నింగ్‌

సీఎం కేసీఆర్‌ తీరుపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. భాజపాలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. తెరాసలో ఉన్నన్ని రోజులు ఏ కేసులు పెట్టలేదు కానీ భాజపాలో చేరగానే కేసులు గుర్తొచ్చాయా అని మండిపడ్డారు.

  • ఫ్రెండ్​కు టీసీ ఇవ్వలేదని కళాశాలలోనే పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. కళాశాలలోని ప్రిన్సిపల్ గదిలోనే సందీప్​ అనే విద్యార్థి తన ఒంటి మీద పెట్రోల్‌ పోసుకున్నాడు. టీసీ కోసం మాట్లాడుతూనే ప్రిన్సిపల్‌ ఎదురుగా విద్యార్థి నిప్పంటించుకున్నాడు.

  • బంగాళాఖాతంలో వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • మళ్లీ ప్రత్యక్షమైన సాలు దొర సెలవు దొర బోర్డు, ఈసారి కల్వకుంట్ల పేరుతో

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సాలు దొర సెలవు దొర బోర్డును మళ్లీ ఏర్పాటు చేశారు. ఈసారి సీఎం కేసీఆర్​ బొమ్మ లేకుండా కల్వకుంట్ల కౌంట్​డౌన్​ పేరుతో బోర్డు పెట్టారు. కార్యకర్తల కోరిక మేరకు కేసీఆర్ బొమ్మ తొలగించి మళ్లీ బోర్డును ఏర్పాటు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్​రెడ్డి స్పష్టం చేశారు.

  • చిన్ని కృష్ణుడికి 108 నైవేద్యాలు

రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నీ దేవాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వరంగల్​ నగరంలోని శ్రీ భగవాన్​ మురళీ కృష్ణ మందిరంలో ఉదయం నుంచే వేడుకలు మొదలయ్యాయి.

  • పంచదార కర్మాగారంలో భారీ పేలుడు

ఏపీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవిస్తునే ఉంది. మొన్న విశాఖపట్టణం, ఆ తరవాత తిరుపతి నేడు కాకినాడ ప్రాంతంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఇవాళ్టి ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8మంది గాయపడ్డారు.

  • ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు

ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు. ఆశ్చర్యంగా అనిపించినా నిజం. శునకాల పేరిట ఉన్న ఆస్తుల ద్వారా ఏటా భారీగా ఆదాయమూ వస్తుంది. అందుకే రాజభోగాలు అనుభవిస్తున్నాయి ఆ కుక్కలు.

  • పాక్​లో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్

పాకిస్థాన్​లోని పలు నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగానే ఆప్టిక్ ఫైబర్​ నెట్​వర్క్​లో సాంకేతిక లోపం ఏర్పడి.. అంతర్జాల సేవలకు అంతరాయం కలిగినట్లు టెలికాం అధికారులు తెలిపారు.

  • అవసరం లేకపోయినా సెట్​లోనే అనుపమ, దర్శకుడి వింత ఆర్డర్

అనుపమ పరమేశ్వరన్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి. అనుపమను సెట్​ నుంచి పంపించాలని అనిపించదన్నారు. ఆమె అవసరం లేకున్నా సెట్​లో అలా ఖాళీగా ఉంచుతానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details