తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2022, 6:59 PM IST

ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

  • అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా మనకు మాత్రం ఊరట లేనట్టే

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 6 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. ఐతే ఇప్పుడప్పుడే ఆ ప్రయోజనం దేశీయ వినియోగదారులకు అందేలా లేదు. ఇన్నాళ్లూ నష్టాలు భరించి పెట్రోల్‌, డీజిల్‌ను విక్రయిస్తూ వచ్చిన దేశీయ చమురు సంస్థలు ఆ నష్టాలను పూడ్చుకోనున్నాయి.

  • కాంగ్రెస్​ను గెలిపించి మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటున్న సీతక్క

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో నియోజకవర్గ ఇంఛార్జి సీతక్క సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్​కు అడ్డా అయిన మునుగోడు గడ్డపై మళ్లీ పార్టీ జెండా ఎగరేసి ఆత్మగౌరవాన్ని నిలబెడదామని కార్యకర్తలకు సీతక్క దిశానిర్దేశం చేశారు.

  • భాజపా రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి రాగం

రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తి రాగాల హవా నడుస్తోంది. కాంగ్రెస్​లో ఈ తరహా స్వరాలు చాలా రోజుల నుంచి గట్టిగానే వినబడుతుండగా ఇటీవలి కాలంలో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు భాజపా వంతు కూడా వచ్చింది. ఉద్యమకారిణిగా ఉన్న తన గొంతు నొక్కేస్తున్నారంటూ రాములమ్మ అసంతృప్తి రాగం అందుకుంది.

  • మర్రి శశిధర్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషేనన్న రేణుకాచౌదరి

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌తో రేణుకాచౌదరి సమావేశమయ్యారు. సీనియర్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆవేదనలో మాట్లాడారని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ మనిషే అని రేణుకాచౌదరి అన్నారు.

  • కోర్టు నుంచి రేప్ కేసు నిందితుడు పరార్, కొట్టి చంపిన స్థానికులు

రెండు రోజుల క్రితం కోర్టు నుంచి తప్పించుకున్ననిందితుడ్ని దుండగులు కొట్టి చంపారు. ఈ ఘటన అసోంలో జరిగింది. నిందితుడిపై గత 15 ఏళ్లలో పలు పోలీస్​ స్టేషన్​లలో అత్యాచారం, దొంగతనం వంటి కేసులు నమోదయ్యాయి.

  • డోలో 650 ప్రిస్క్రైబ్ చేసేందుకు వారికి రూ.వెయ్యి కోట్ల గిఫ్ట్స్​, సుప్రీం సీరియస్

డోలో 650 ఔషధ తయారీ సంస్థ తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు వైద్యులకు తాయిలాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఆందోళకరమైన పరిణామమని అభిప్రాయపడింది. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

  • కాయిన్స్​తో కోట్ల మోసం, స్టేట్​ బ్యాంక్​లో భారీ స్కామ్​, రంగంలోకి సీబీఐ

భారతీయ స్టేట్​ బ్యాంక్​లో నాణేలు మాయమైన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. వేర్వేరు రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు జరిపింది.

  • అదిరే ఫీచర్స్, నయా లుక్​తో మారుతీ ఆల్టో కె10, ధర ఎంతంటే

ప్రముఖ వాహనాల ఉత్పత్తి తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కొత్త మోడల్​ను మార్కెట్​లోకి తెచ్చింది. మారుతీ సుజుకీ ఆల్టో కె10ను గురువారం లాంఛ్ చేసింది. మరోవైపు హోండా కంపెనీ యాక్టివా సిరీస్​లో మరో కొత్త మోడల్ స్కూటర్​ను ఆవిష్కరించింది.

  • చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా, నిజమెంత

టీమ్​ఇండియా క్రికెటర్​ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ధనశ్రీ చేసిన ఓ పని ఆ అనుమానాలకు తావిచ్చింది. అయితే, దీనిపై చాహల్ వివరణ ఇచ్చాడు.

  • లక్షలాది అభిమానుల మధ్య చిరంజీవి బర్త్​డే, ఘనంగా మెగా కార్నివాల్​

ప్రతి మెగా అభిమాని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు మెగాబ్రదర్​ నాగబాబు.

ABOUT THE AUTHOR

...view details