తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 5PM - 5PM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news
Telangana Top news

By

Published : Aug 18, 2022, 4:59 PM IST

  • బీచ్​లో అనుమానిత బోటు, లోపల ఏకే47 గన్స్, అసలేమైంది

బీచ్​లో ఏకే47 ఆయుధాలు ఉన్న ఓ బోటు కనిపించడం కలకలం రేపింది. దీనిపై మహారాష్ట్ర రాయగఢ్​ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు.

  • బంగాళాఖాతంలో అల్పపీడనం

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తద్వారా రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • పాఠశాల పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలు

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలైనా శిథిలావస్థకు చేరుకున్న వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై కప్పులు కూలిపోతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో ఎదిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

  • భాజపా రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి రాగం

రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తి రాగాల హవా నడుస్తోంది. కాంగ్రెస్​లో ఈ తరహా స్వరాలు చాలా రోజుల నుంచి గట్టిగానే వినబడుతుండగా.. ఇటీవలి కాలంలో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు భాజపా వంతు కూడా వచ్చింది. ఉద్యమకారిణిగా ఉన్న తన గొంతు నొక్కేస్తున్నారంటూ.. రాములమ్మ అసంతృప్తి రాగం అందుకుంది.

  • రామోజీ ఫిల్మ్‌సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం

రామోజీ ఫిల్మ్‌సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం కుదిరింది. పర్యాటకులను ఆకర్షించేలా ఐఆర్‌సీటీసీతో ఒప్పందం జరిగింది. దేశవ్యాప్తంగా పర్యాటక సంస్థలకు ఐఆర్‌సీటీసీ ద్వారా సమాచారం అందనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించటమే కాకుండా.. ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం కుదిరింది.

  • నీతీశ్ అలా చేస్తే ప్రచారం మానేస్తానన్న పీకే

బిహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనపై నీతీశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే తాను ప్రచారం మానేస్తానని అన్నారు.

  • వేతనాల పెంపు ఖాయం, 3 నెలలకోసారి ప్రమోషన్‌

ఉద్యోగుల వేతనాల పెంపును ఆపడం లేదని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో స్పష్టం చేసింది. ప్రమోషన్లు సైతం క్రమంగా అమల్లోకి వస్తున్నాయని తెలిపింది. మెరుగైన ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు త్రైమాసికాలవారీగానూ ప్రమోషన్లు ఇస్తామని పేర్కొంది.

  • 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనిషి, త్వరలోనే నాసా ప్రయోగం

50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్టెమిస్‌ 1 మిషన్‌లో భాగంగా ఆగస్టు 29వ తేదీన నాసా మూన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 98 మీటర్లు పొడవున్న ఈ భారీ రాకెట్‌ను ఇప్పటికే లాంచ్‌పాడ్‌కు తరలించారు.

  • లక్షలాది అభిమానుల మధ్య చిరంజీవి బర్త్​డే, ఘనంగా మెగా కార్నివాల్​

ప్రతి మెగా అభిమాని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు మెగాబ్రదర్​ నాగబాబు.

  • సర్​ప్రైజ్​, ఈ సారి హృతిక్​తో పాటు ఆ సౌత్​ స్టార్ హీరో

క్రిష్​ 4 కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హృతిక్​ రోషన్​తో పాటు మరో సౌత్​ స్టార్​ హీరో కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు.

ABOUT THE AUTHOR

...view details