తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Aug 18, 2022, 2:58 PM IST

  • సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్, భువనగిరి ఎంపీ​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోనియా గాంధీ అపాయింట్​మెంట్​ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన సోనియాకు వివరించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఇటీవల జరుగుతోన్న కోల్డ్​ వార్ నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • కేసీఆర్‌ను గద్దె దించడమే సర్వాయి పాపన్నకు ఇచ్చే నివాళి అన్న లక్ష్మణ్

నిజాం తరహా పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించడమే సర్వాయి పాపన్నకు మనం ఇచ్చే ఘననివాళి అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • రౌడీతో లవ్, అతడితో వెళ్లడానికి భలే ప్లాన్

ఓ రౌడీషీటరు, మైనర్ బాలికను ప్రేమించాడు, తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. అమ్మాయికి 17 సంవత్సరాలు కావడంతో ఇంట్లో అడ్డు చెబుతారేమో అని, ఆ ఇద్దరు కలిసి ఓ ప్లాన్ వేసుకున్నారు. ఫలితంగా ఆ బాలిక ఇంటికి దగ్గరలో ఉన్న కాలువలోకి దూకింది. ఆత్మహత్యకు పాల్పడినట్లు అందరు అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో రౌడీషీటరే ఆ బాలికను అపహరించినట్లు వెల్లడైంది.

  • నీతీశ్ అలా చేస్తే ప్రచారం మానేస్తానన్న పీకే

బిహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనపై నీతీశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే తాను ప్రచారం మానేస్తానని అన్నారు.

  • 8 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం వేటు, ఎందుకంటే

యూట్యూబ్​ ఛానళ్లను బ్లాక్​ చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్రం తెలిపింది. కారణం ఏంటంటే

  • మంకీపాక్స్ విజృంభణ,​ వ్యాక్సిన్​పై డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్​ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క వారంలో 20 శాతం కేసులు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే మంకీపాక్స్​ టీకాలు 100 శాతం ప్రభావం చూపుతాయని ఆశించలేమని పేర్కొంది.

  • వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​, ఒక్క స్వైప్‌తో కెమెరా యాక్సెస్

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ పేజ్‌ను కుడివైపు స్వైప్‌ చేయడం లేదా కెమెరా ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో కెమెరా ఆప్షన్‌ వచ్చేలా కొత్త అప్​డేట్​ను తీసుకువచ్చింది.

  • స్టార్​ ఫుట్​బాలర్​ రొనాల్డోకు పోలీసుల హెచ్చరిక

గతంలో ఓ అభిమాని విషయంలో ప్రవర్తించిన తీరుపై స్టార్​ ఫుట్​బాలర్​ రొనాల్డోను విచారించారు పోలీసులు. అనంతరం హెచ్చరిక జారి చేసి విడిచిపెట్టారు. ఏం జరిగిందంటే

  • ప్రోమోతో ఆ పదానికి క్లారిటీ ఇచ్చిన నాగ్​ ఘోస్ట్​ టీమ్​

తమ హగనే ఈ ఒక్క పదానికి అర్ధం తెలియక సినీ ప్రియులు తికమక పడుతున్న సమయంలో ది ఘోస్ట్​ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దానికి అర్థం చెబుతూ ఓ ప్రోమోను విడుదల చేసింది.

  • శ్రద్దాదాస్​ ముద్దు కోసం హైపర్​ ఆది సాహసం, ఏం చేశాడంటే

నటి శ్రద్దాదాస్జ జబర్దస్త్​ కమెడియన్​ హైపర్​ఆదికి ఓ స్పెషల్​ టాస్క్​ ఇచ్చింది. అది పూర్తి చేస్తే అతడికి ముద్దు ఇస్తానని ఆఫర్​ చేసింది. దాని కోసం ఆది పెద్ద సాహసమే చేశాడు. ఏంటంటే..

ABOUT THE AUTHOR

...view details