తెలంగాణ

telangana

ETV Bharat / city

7పీఎం తెలంగాణ టాప్​న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Aug 10, 2022, 6:58 PM IST

  • తదుపరి సీజేఐగా జస్టిస్​ ఉమేశ్​ లలిత్​

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ యు.యు.లలిత్‌ (ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌) భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇటీవలే జస్టిస్​ లలిత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ.

  • 'ప్రధాని అభ్యర్థిగా నీతీశ్ కుమార్​'.. పీకే కీలక వ్యాఖ్యలు

భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అసౌకర్యంగానే ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అలాగే తాజాగా ఏర్పడిన జేడీయూ- ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తారని జోస్యం చెప్పారు.

  • ఎల్లుండి ఎంసెట్​ ఫలితాల విడుదల..!

రాష్ట్రంలో ఎంసెట్​ ఫలితాల విడుదలకు ముహుర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 12న లేదా 13న ఫలితాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఎంసెట్​ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. ఆ తరువాత ఫలితాల ప్రకటనే..

  • ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప నిజమేంటో చెప్పలేం: ఎస్పీ ఫకీరప్ప

ఏపీలో సంచలనం రేకెత్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు బుధవారం వెల్లడించారు.

  • కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ప్రియురాలి ఎంట్రీ..

కాసేపట్లో పెళ్లి ముహుర్తం.. బంధువులందరి చేతుల్లో అక్షతలు.. పంతులు నోట వేద మంత్రాలు.. మేళతాళాల చప్పుడు.. వధువు మెడలో వరుడు తాళి కట్టటమే తరువాయి. ఇంతలోనే.. ఆపండీ... అంటూ ఓ యువతి అరుపు.. కట్​ చేస్తే.. పెళ్లి ఆగిపోవటం.. ఫ్లాష్​బ్యాక్​ స్టోరీ..!! ఇదంతా తెలుగు సినిమాల్లోని పెళ్లి సన్నివేశాల్లో మనం తరచూ చూసేదే. అయితే.. అచ్చంగా ఇదే సన్నివేశం నిజజీవితంలోనూ జరిగింది. నమ్మట్లేదా.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

  • విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన..

పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. పాఠశాలకు వచ్చి అతన్ని చితకబాదారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది.

  • జూరాలకు భారీగా వరద... 38 గేట్లు ఎత్తిన అధికారులు

జూరాలకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు తోడు ఆల్మట్టి, నారాయణపూర్​ నిండటంతో.. భారీ వరద జూరాలకు వస్తోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.

  • నుపుర్​ శర్మకు ఊరట.. ఎఫ్ఐఆర్​లన్నీ దిల్లీకి బదిలీ

భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నుపుర్‌ శర్మపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్​లను దిల్లీ పోలీసులకు బదిలీచేయాలని సుప్రీం ఆదేశించింది.

  • కేంద్రం కీలక నిర్ణయం..

దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31న అమల్లోకి రానుందని తెలిపారు.

  • వారి లోన్​కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా? ఈ రిస్క్​లు ఉండొచ్చు!

ఒకవేళ లోన్‌ తీసుకున్న వ్యక్తి లేదా వ్యక్తులు సకాలంలో వాయిదా చెల్లించలేకపోతే.. ఆ బాధ్యత హామీదారుపై కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం హామీ సంతకం చేసే వ్యక్తి క్రెడిట్‌ స్కోరుపై కూడా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details