ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుసీఎం పదవికి నితీశ్ రాజీనామా.. రాజకీయ పునరేకీకరణతో బిహార్ పాలిటిక్స్ మరోసారి కీలక మలుపు తిరిగాయి. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న భాజపాకు రెండోసారి షాక్ ఇస్తూ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది జేడీయూ. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. భారీగా పెరిగిన మోదీ ఆస్తులు..భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. ఎంత ఆస్తులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఏటా ఆయన తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈసారి మరి మోదీ ఆస్తుల విలువ ఎంత పెరిగిందో తెలుసా?తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 11న (గురువారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది.గ్యాస్, నిత్యావసరాల తగ్గించిన పార్టీకే ఓటేస్తాం: బండి సంజయ్‌తో గ్రామస్థులురాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. యాదాద్రి జిల్లా తాళ్లసింగారంలో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్... ప్రజలకు ఇళ్లు ఇవ్వని పాపం కేసీఆర్‌దేనని ఆరోపించారు.భాజపాలోకి జయసుధ..? భాజపా నేతలు తన ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధమన్న సినీనటి జయసుధ ప్రకటించారు. అయితే ఈ నెల 21 భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలను కోవడం లేదని తెలిపారు. ఈనెల 21 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు భాజపాలో చేరతారనే వార్తలపై ఆమె స్పందించారు.పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు..హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం వేడుకలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. అంబారీపై బీబీకా ఆలం ఊరేగింపు కార్యకమం చేపట్టారు. ఈ యాత్ర డబీర్ పుర నుంచి చాదర్ ఘాట్ వరకు కొనసాగనుంది.గాంధీని నిలదీసి.. నారీమణుల ఉప్పు సత్యాగ్రహం పిలవని పేరంటం దిక్కు కూడా చూడని భారత నారీమణులు.. భారత జాతీయోద్యమంలో మాత్రం ఓసారి 'పిలుపు' కోసం డిమాండ్ చేశారు. మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదంటూ గాంధీజీని నిలదీశారు. బ్రిటిష్‌వారినే కాదు.. మహాత్ముడి మాటను సైతం కాదని కొంగులు బిగించి రంగంలోకి దూకారు! ఒళ్లు కాలినా.. చీరలు చిరిగినా వెరవకుండా అనుకున్నది సాధించారు.ముగ్గు వేస్తుండగా మహిళ 'గోల్డ్ చైన్' చోరీ..ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగ అపహరించిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. హోలేనరసీపుర్ పట్టణంలోని సరస్వతి అనే మహిళ ముగ్గు వేస్తున్న సమయంలో ఓ దొంగ ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే బాధిత మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె నోరు మూసేసి గొలుసు తెంపుకుని దొంగ పారిపోయాడు.టీ-20 క్రికెట్లో 600 మ్యాచ్‌లు.. పొట్టి క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు విండీస్ స్టార్ క్రికెటర్. ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 600 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. అతడి దరిదాపుల్లోనూ ఎవరూ లేకపోవడం విశేషం. ఇంతకీ ఎవరా ఆటగాడు?బాలయ్య నటించిన ఆ సినిమాకు నో సెన్సార్ కట్!నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లో యమా స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. అయితే.. బాలయ్య నటించిన ఓ సినిమా సెన్సార్ చేసినప్పుడు ఒక్క కట్ కూడా చేయలేదట. ఇంతకీ అదే సినిమానో తెలుసా?