తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్ న్యూస్ @ 5PM - 5PM టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM
5PM

By

Published : Jul 5, 2022, 4:58 PM IST

  • ఐదో టెస్టులో ఇంగ్లాండ్​ విజయం- భారత్​తో సిరీస్​ సమం

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఐదో టెస్ట్​లో భారత్​పై ఇంగ్లాండ్​ విజయం సాధించింది. భారత్‌పై 7 వికెట్ల తేడాతో స్టోక్స్​ సేన గెలిచింది. దీంతో సిరీస్ 2-2తో​ సమమైంది. భారత్​ తొలి ఇన్నింగ్స్‌లో 416, రెండో ఇన్నింగ్స్‌ 245 పరుగులు చేసింది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్‌లో 284, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నష్టపోయి.. 378 పరుగులు చేసిన సునాయసంగా విజయాన్ని అందుుకుంది.

  • ఏపీపై కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు..

ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు.

  • 'కాంగ్రెస్​ ఏ ఒక్కరి సొత్తు కాదు..'

పీజేఆర్​ తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి ఇంట్లో విందు సమావేశానికి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు హాజరయ్యారు. విందు అనంతరం మీడియా మాట్లాడిన నేతలు.. విష్ణువర్ధన్​రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. చివరివరకు కాంగ్రెస్​తోనే ఉంటారని స్పష్టం చేశారు.

  • 'విష్ణువర్ధన్‌ నన్ను కూడా లంచ్‌కు పిలిచాడు.. కానీ'

దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్కం ఠాగూర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ నేతల తీరు, తిరుగుబాటు ధోరణిపై చర్చించారు.

  • సర్పదోషం ఉంది.. శాంతి చేయాలని రూ.₹37 లక్షలు స్వాహా

అమాయకులను మోసగిస్తున్న నకిలీ బాబాల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జబ్బులు నయం చేస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ మహేశ్ భగవత్​ తెలిపారు.

  • రాహుల్​ గాంధీపై ఆ వీడియోలు..

న్యూస్​ యాంకర్​ రోహిత్​ రంజన్​పై ఛత్తీస్​గఢ్​లో కేసు నమోదైంది. రాహుల్​ గాంధీపై నకిలీ వీడియోల వ్యవహారంలో అతడిని అరెస్టు చేసేందుకు యూపీలోని గాజియాబాద్​ వెళ్లారు. దీనిని అడ్డుకున్న యూపీ పోలీసులు.. యాంకర్​ను తమతో తీసుకెళ్లారు. దీంతో హైడ్రామా నెలకొంది.

  • రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

భారత రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని ఆరోపించారు కేరళ మంత్రి సాజి చెరియన్​. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు.. మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేశాయి. ఈ వాదనను అధికార సీపీఎం తోసిపుచ్చింది.

  • ప్రముఖ వాస్తు సిద్ధాంతి హత్య.. సీఎం సీరియస్

ప్రముఖ వాస్తు సిద్ధాంతి హత్యకు గురి కావడం.. కర్ణాటకలో కలకలం రేపింది. ఓ హోటల్ రిసెప్షన్​లో ఆయన్ను ఇద్దరు దుండగులు కిరాతకంగా పొడిచి చంపారు.

  • భారత​ ఫ్యాన్స్​పై జాత్యహంకార వ్యాఖ్యలు..

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో భారత అభిమానుల పట్ల పలువురు జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంపై ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు అప్రమత్తమైంది. దీనిపై విచారణ చేయించి చర్యలు చేపడతానని చెప్పింది.

  • ' మీరు ఇంత దిగజారడం బాధగా ఉంది'..

'ఆర్​ఆర్​ఆర్' సినిమాపై అస్కార్​ గ్రహీత.. రసూల్​ పూకుట్టి చేసిన సంచలన వ్యాఖ్యలపై 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. 'మీ లాటి స్థాయి ఉన్న వాళ్లు ఇంత దిగజారడం బాధగా ఉంది' అంటూ.. గట్టి కౌంటర్​ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details