తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్@9AM - Telnagana top ten news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news

By

Published : Apr 19, 2022, 8:59 AM IST

  • విద్యార్థులకు గుడ్​న్యూస్

మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? చదువు కోసం వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. విద్యార్థి వీసాల స్లాట్ల సంఖ్యను ఆ దేశం భారీగా పెంచింది. హైదరాబాద్​లోని కాన్సులేట్​ పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వారి ఎదురుచూపులకు ఆ దేశం తెరదించింది.

  • టోనీ నుంచే పుడింగ్ పబ్​కు డ్రగ్స్

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నైజీరియన్ టోనీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. టోనీ నుంచి కొకైన్ తీసుకున్న హైదరాబాదీయుల్లో కొందరికి పుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులతో పరిచయాలున్నట్లు పోలీసులకు పలు ఆధారాలు లభించాయి.

  • అప్పుల పరిస్థితి ఆందోళనకరం

ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... "ది ప్రింట్” సంచలనాత్మక కథనం ప్రచురించింది. అధికారిక అప్పుల ఆధారంగా ఆ జాబితాలో ఆంధ్ర నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

  • సాధారణ బియ్యం ఎంతైనా తీసుకుంటాం

యాసంగి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. యాసంగిలో ఉప్పుడు కాకుండా సాధారణ బియ్యం ఎంత మొత్తంలో అయినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

  • రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో?

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎన్డీఏకు సొంతంగా అవసరమైన మెజారిటీ లేదు. విపక్షాలు ఉమ్మడిగా కలిసి నడిస్తే విజయతీరాలకు చేరుకోగలవు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

  • 'పెళ్లై ఏడాదైనా కాకుండా విడాకులా?

పెళ్లి అయి ఏడాది కూడా పూర్తవ్వకుండానే విడాకులు కోరిన ఓ జంట విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సంయోగ సంబంధానికి నిరాకరించడం విడాకులకు కారణమైనప్పటికీ, క్రూరత్వంగా పరిగణించినప్పటికీ.. దాన్ని అసాధారణ కష్టంగా పరిగణించలేమని పేర్కొంది.

  • నల్ల మనసును ప్రపంచానికి చాటిన యూరోపియన్లు

నాగరికులమని, ఆధునికులమని... భారతీయులను ఉద్ధరించడానికి వచ్చినవారమని డప్పు కొట్టుకున్న బ్రిటిష్‌ సర్కారు గాలిని వారి దేశస్థులే తీసేశారు. బలగాల్లో చేరడానికి భారత్‌కు తరలివచ్చిన అనేక మంది యూరోపియన్లు చివరకి... తెల్ల మనుషుల నల్ల మనసును ప్రపంచానికి చాటారు.

  • మరో ప్రచ్ఛన్న యుద్ధం!

మొదట కొవిడ్‌, తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధం- ప్రపంచమంతటా చమురు, ఆహార ధాన్యాలు, వ్యాపార సరకుల ఉత్పత్తి, సరఫరా తీరును మార్చేస్తున్నాయి. ప్రపంచీకరణను వెనక్కుతిప్పే ధోరణి డొనాల్డ్‌ ట్రంప్‌ హయాములోనే మొదలై తాజాగా మరింత ఊపందుకుంది.

  • ఈషా బర్త్​డే

'అ!', 'అరవింద సమేత..', 'సుబ్రహ్మణ్యపురం' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఈషా రెబ్బా. ఓటీటీల్లోకి అడుగుపెట్టి 'పిట్టకథలు','‘త్రీ రోజెస్‌' లాంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందడి చేసింది. అందం, నటనతో సినీప్రియుల్ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు ఏప్రిల్​ 19.

  • మిచెల్ మార్ష్​కు నెగెటివ్..

దిల్లీ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్​కు ఆర్​టీపీసీఆర్ టెస్టులో కరోనా నెగెటివ్​గా వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దిల్లీ టీమ్ ఫిజియోకు సైతం కరోనా నెగెటివ్​గా తేలిందని వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details