ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుదేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు Covid Cases In India: దేశంలో కొత్తగా 2,183 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 214 మంది చనిపోయారు.సిద్ధమైన తెలంగాణ 'స్పేస్-టెక్'Space-Tech: అంతరిక్ష సేవల్లోనూ దూసుకుపోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ 'స్పేస్-టెక్' విధానాన్ని.. మంత్రి కేటీఆర్ లాంఛనంగా విడుదల చేయనున్నారు. యాదాద్రిలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం నేటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తులు జరిపించే స్వామివారి నిత్యకల్యాణం కూడా ప్రారంభం కానుంది. రేపట్నుంచి శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించనున్నారు.ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైన కుమురం భీం జిల్లాPOSHAN ABHIYAN: పోషణ్ అభియాన్ కార్యక్రమ అమలులో భాగంగా 2021 సంవత్సరానికి గానూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సంబంధిత అధికారులను ఆమె అభినందించారు.అసెంబ్లీని ముట్టడించిన 3 లక్షల మంది డ్రైవర్లు ఒడిశా అసెంబ్లీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు డ్రైవర్లు. దాదాపు 3లక్షల మంది డ్రైవర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డెక్కారు.'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'Non BJP CMs Meeting: ముంబయి వేదికగా భాజపాయేతర ముఖ్యమంత్రుల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు రౌత్ వెల్లడించారు.నెల్లూరులో పోటాపోటీ సభలు... Minister and Ex minister meeting in Nellore: అధిష్ఠానం జోక్యంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైకాపా అంతర్గత పోరుకు తాత్కాలికంగా తెరపడింది. బలప్రదర్శనే లక్ష్యంగా పోటాపోటీ సభలు నిర్వహించినా.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ పరస్పరం విమర్శల జోలికిపోలేదు. అధినాయకత్వం జోక్యంతో వివాదం సద్దుమణిగింది.భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. Stock market News: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1041 పాయింట్లు కోల్పోయి 57,297కి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు క్షీణించి 17,230 వద్ద ట్రేడవుతోంది.'బ్లడీ మేరీ' ఎలా ఉందంటే? Niveda pethuraj Bloody mary movie review: హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన తాజా చిత్రం 'బ్లడీ మేరీ'. చందూ మొండేటి దర్శకుడు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది. మరి సినిమా కథేంటి? ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి..కౌంటీల్లో పుజారా డబుల్ సెంచరీCheteshwar Pujara: ఫామ్‌లేమితో భారత జట్టులో చోటు కోల్పోయిన టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా.. ఇంగ్లాండ్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససెక్స్ తరఫున ఆడుతున్న పుజారా అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పించాడు.