ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక అప్పుడే' Congress new president: కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఇది పూర్తైన వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2022 సెప్టెంబర్ చివరి నాటికి పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని తెలిపారు.దేశంలో ఒమిక్రాన్ కలవరం... Omicron community spread: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమవుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విదేశీ ప్రయాణాలు చేయని వారికి ఒమిక్రాన్ సోకుతోందని దిల్లీ ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. దీన్ని బట్టి సామాజిక వ్యాప్తి వేగం పుంజుకుందని అన్నారు.'ఇక నగర ప్రజలకు ఇబ్బంది ఉండదు' Minister KTR on Hyderabad Floods : హైదరాబాద్‌లో నాలాల సమస్యకు తెలంగాణ సర్కార్ శాశ్వత పరిష్కారం చూపనుంది. హుస్సేన్‌సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లో చాలా ప్రాంతాలు జలమయమవగా.. రక్షణ గోడ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఒమిక్రాన్ విస్తరిస్తుంటే.. సీఎం ఏం చేస్తున్నారు?MLA Rajasingh on CM KCR: రాష్ట్రంలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్.. న్యూ ఇయర్ వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరాను కట్టడి చేయడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడుతున్నాయి. తగ్గేదేలే అంటున్న దివ్యాంగులు..Wheel Chair Cricket Tourney : పుట్టుకతోనో, ప్రమాదల కారణంగానో అవయవాలు కోల్పోయిన దివ్యాంగులు మన చుట్టూ ఉంటారు. అలాంటి వాళ్లను ప్రత్యేకవర్గంగా చూస్తుంటోంది.. సమాజం. వాళ్ల మనసుల్ని నిరాశ, నిస్పృహలతో నింపేస్తుంటుంది. కానీ.. ఈ యువకులు మాత్రం అలా కాదు. తమ విధిరాతకు బాధ పడుతూ ఇళ్లకి పరిమితం కాలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి.. క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నారు.ఏపీలో మూతపడిన థియేటర్లు రీఓపెన్AP Govt Permission to Theaters: ఏపీలో సినిమా థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభత్వం అనుమతి ఇచ్చింది. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ ఉత్తర్వుల్లో ఆదేశించారు.పదోతరగతి చదవి.. ప్రపంచాన్ని చుట్టేశాడుTelugu Traveller : చదివింది పదో తరగతే అయినా తన తెలివితో అనుకున్నది సాధించాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఇంతకు అతను ఏం చేశాడు.. అతనికున్న క్రేజ్ ఏంటి..?కోహ్లీ అలా చేసుండాల్సింది కాదుIND vs SA Test: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. దీనిపై భారత జట్టు దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడాడు. కోహ్లీ మదిలో వేరే ఆలోచన ఉందని అన్నాడు.'మిస్ చంఢీగడ్'.. మతిపోగొట్టే అందాలుగుర్లీన్ కౌర్ చోప్రా.. హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందింది. నేడు ఈ భామ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె విశేషాలు చూద్దాం.