తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2021, 9:02 AM IST

Updated : Dec 30, 2021, 9:59 AM IST

ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS

  • సైన్స్​ సిటీ ఏర్పాటుకు గ్రీన్​సిగ్నల్

Science City in Hyderabad : తెలంగాణలో యువతకు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అభిరుచి కలిగించి.. ఆ దిశగా పరిశోధనలపై ఆసక్తి పెంచుతుంది సైన్స్ సిటీ. రాష్ట్రంలో ఈ సైన్స్ సిటీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు లేఖ రాశారు.

  • మళ్లీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్

Telangana Teachers Counselling : రాష్ట్రంలో ఉపాధ్యాయుల కేటాయింపుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. భార్యాభర్తల కేటగిరీలో తమను ఒకే జిల్లాకు కేటాయించాలంటూ పెద్దసంఖ్యలో విజ్ఞప్తులు రావడం వల్ల వాటి పరిశీలన, పరిష్కారానికి సమయం పడుతుందని తాత్కాలికంగా కౌన్సెలింగ్ ఆపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ కౌన్సెలింగ్ ప్రారంభించాలని బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్లు, డీఈవోలు కసరత్తు మొదలుపెట్టారు.

  • విద్యార్థినిపై టీచర్​ అత్యాాచారం

rape on student in shamirpet : విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా శామీర్​పేట ఠాణా పరిధిలో జరిగింది.

  • అధిక చలితో ముప్పు తప్పదా?

Extreme Cold Weather: చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఈ చలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధిక చలితో పొంచి ఉన్న ముప్పు ఏంటి? దీని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.

  • రోడ్డుపై కుప్పలుతెప్పలుగా కరెన్సీ నోట్ల తుక్కు

Torn Currency Notes on The Road : చిరిగిన కరెన్సీ నోట్లు రోడ్డుపై కుప్పలుకుప్పలుగా కనిపించడం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపర్​ వద్ద కలకలం రేపింది. హైదరాబాద్​-నాగ్​పుర్ జాతీయ రహదారిపై కనిపించిన నోట్ల తుక్కు.. అసలైన నోట్లవా.. లేక నకిలీవా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారనే అనుమానాలకు తావిస్తోంది.

  • ఇంటి నిండా పక్షులే..

Bird lover in mahabubabad: పక్షులంటే ఆ యువకుడికితో పాటు ఇంటిల్లిపాది, బంధు మిత్రులకు ఇష్టం. అవే వారికి పంచప్రాణాలు. పిల్లలకు నేస్తాలు. సమయం దొరికితే చాలు వాటితోనే కాలక్షేపం. ఆ కుటుంబం మొత్తం పక్షి ప్రేమికులే. చిన్ననాటి నుంచి పక్షుల మీద మక్కువ ఎక్కువ. వాటి ఆలనాపాలనా చూస్తూనే వాళ్లంతా మైమరచిపోతుంటారు. మరి మన పక్షిరాజును మనమూ ఓసారి పలకరించి.. ఆ పక్షుల కిలకిలరావాలు విందాం రండి..

  • 'మోదీలో మాత్రమే ఆ ప్రత్యేకత'..

Sharad Pawar praises Modi: పరిపాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి పట్టుందని, అదే ఆయన బలమని కొనియాడారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు శరద్​ పవార్​. ఏదైనా పనిని ప్రారంభించారంటే పూర్తయ్యే వరకు విశ్రమించరని ప్రశంసించారు. ఓ మరాఠి దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు పవార్​.

  • 'ఒమిక్రాన్‌తో ఆర్థిక వృద్ధికి విఘాతమే'

దేశ ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్​ సవాలుగా మారనుందని ఆర్​బీఐ ఇటీవల పేర్కొంది. మరోవైపు ప్రైవేటు క్రిప్టోకరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గుల కారణంగా మోసాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం విడుదల చేసిన రెండో 'ఆర్థిక స్థిరత్వ నివేదిక'లో ఈ విషయాలను పేర్కొంది.

  • 17 ఏళ్లకే ప్రపంచ కిరీటం..

World Rapid Chess Championship 2021: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి ఫేవరేట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు 17 ఏళ్ల నోడిర్బెక్‌ అబ్దుసటోరోవ్‌. కార్ల్‌సన్‌పై నెగ్గడమే కాకుండా.. చివరి వరకూ దూకుడు కొనసాగించిన ఆ టీనేజర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు.

  • టికెట్​ రేట్లపై వర్మ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్​ ఎన్​కౌంటర్​ ఘటన నేపథ్యంలో వస్తున్న చిత్రం 'ఆశ ఎన్​కౌంటర్'​. ఈ ఘటనకు ముందు మాములు మనుషులుగా ఉన్న వ్యక్తులు.. ఆ సమయంలో రాక్షసులుగా ఎలా మారారన్న ఆసక్తికర అంశాన్ని సినిమాలో చూపించబోతున్నామని చెప్పారు దర్శకుడు రామ్​ గోపాల్ వర్మ. ఏపీలో టికెట్ రేట్ల అంశంపైనా స్పందించారు ఆర్​జీవీ. .

Last Updated : Dec 30, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details