- ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్..
హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేనికైనా హైదరాబాద్ నుంచే టీకా రావాలి
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్లాను జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తన ఒక్కరిది కాదని.. ఫార్మా, లైఫ్ సెన్సెస్ ఎకోసిస్టమ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- న్యాయవాది కారును ఢీకొట్టిన లారీ
జనగామ జిల్లా యశ్వంత్‌పూర్ వద్ద హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ప్రమాదం నుంచి న్యాయవాది దుర్గాప్రసాద్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇది ప్రమాదం కాదని.. తనను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నమని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు..
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు మంగళవారం గడువు ముగియనుండగా... పలువురు అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. మంచిరోజు కావడం వల్ల ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బంగాల్లో సిండికేట్ రాజ్యం'
బంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. హుగ్లీలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. సామాన్యులు డబ్బులు ఇవ్వకుండా ఒక్క పనీ జరగడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయి'