ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'భాజపా స్థాయి మరింత దిగజారినట్లైంది' బిల్కిస్ బానో అత్యాచార దోషులను విడుదల చేయటంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రేపిస్టులను, పిల్లలను చంపిన వారిని వదిలేయడంతో భాజపా స్థాయి మరింత దిగజారినట్లైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.'రూ.40 వేలు తీసుకుని భాజపాకు ఓటు వేయండి'సీఎం కేసీఆర్‌ది దండుపాళ్యం ముఠా అని.. ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఓడించేందుకు ఆ బ్యాచ్ అంతా మునుగోడుకు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీ అలర్ట్.. మరో 48 గంటల్లో అల్పపీడనం..! రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.పవన్‌ను కలిసిన చంద్రబాబు..తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఏపీలోని విజయవాడ నోవాటెల్ హోటల్‌కు వెళ్లి పవన్‌తో సమావేశమైన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.భయపెడుతున్న కొత్త ఒమిక్రాన్ వేరియంట్..ఒమిక్రాన్ తాజా వేరియంట్ BF.7 భయపెడుతోంది. దీపావళి సెలవుల వేళ ఈ కొత్త వేరియంట్ దేశంలో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.బరువు తగ్గి రూ.2,300 కోట్లు రాబట్టిన ఎంపీ 32 కిలోల బరువు తగ్గి రూ. 2,300 కోట్లు సంపాందించారు ఓ వ్యక్తి. ఇదేంటీ బరువు తగ్గితే అన్ని కోట్లు ఇస్తారా? అనుకుంటున్నారా! ఆ మధ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విసిరిన సవాల్ స్వీకరించిన.. మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఎంపీ, భాజపా నేత అనిల్ ఫిరోజియా కేంద్రం నుంచి నియోజక అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు నిధులు సాధించారు.'ఆ రోడ్డు ప్రమాదాలకు ఇకపై అధికారులే బాధ్యులు'రోడ్డు నిర్మాణ నాణ్యతలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎన్‌హెచ్‌ఏఐ సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ అలాంటి రోడ్లలో ప్రమాదాలు జరిగితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.తప్పులు చేశాం.. క్షమించండి : బ్రిటన్ ప్రధాని బ్రిటన్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందన్న వార్తలు.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారన్న ఊహాగానాలు.. ప్రధాని వైఖరిపై మెజార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారన్న సర్వేల నేపథ్యంలో లిజ్ ట్రస్ క్షమాపణలు చెప్పారు. పాక్ పర్యటనకు టీమ్ఇండియా..వచ్చే ఏడాది జరగబోయే ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోయేది లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. అది తటస్త వేదికలో జరుగుతుందని తెలిపాడు. ఇక ఆ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదే అని తెలిపారు.అల్లుఅర్జున్-రామ్‌చరణ్ కాంబోలో మల్టీస్టారర్.. తమ అభిమాన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే ఫ్యాన్స్‌కు వచ్చే ఆ కిక్కే వేరు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌లో రామ్‌చరణ్-అల్లుఅర్జున్ ఒకటి. వారిద్దరు కలిసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. అయితా అదే కోరిక తనుకు కూడా ఉందని ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ తెలిపారు.