ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...మంత్రివర్గ భేటీ.. వాటిపైనే చర్చ.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్టు సమాచారం. కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.మహిళకు ఉజ్వల భవిష్యత్తు కల్పించిన పెద్దన్న..Ktr On Raksha Bandhan: ఎల్లప్పుడు సోదరికి అండగా నిలవడమే రక్షాబంధన్ ప్రతీకా అని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో జూమ్ కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు.రాష్ట్రంలో ఉత్సాహంగా ఫ్రీడమ్ రన్.. Freedom Run: స్వరాజ్య స్ఫూర్తి చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ ద్విస్వప్తాహ కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. బానిస సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్న భారతవణి 75వసంతాలు పూర్తి చేసుకున్న వేళ... రాష్ట్ర ప్రభుత్వం రోజువారీగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు అంబరాన్నంటుతున్నాయి. నాల్గో రోజు ఫ్రీడమ్ రన్ పేరుతో పట్టణాల వీధుల్లో.... ఊరువాడల్లో నిర్వహించిన పరుగులు ఉత్సాహంగా సాగాయి.రేపే ఎంసెట్, ఈసెట్ ఫలితాలు..EAMCET Results 2022: రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఎంసెట్, 11 గంటల 45 నిమిషాలకు ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.కొత్త వ్యాధి కలకలం.. 12 వేల మూగజీవాలు బలి Lumpy disease: పలు రాష్ట్రాల్లో లంపీ చర్మవ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా రాజస్థాన్‌లో 12 వేల పశువులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధించింది.యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..!ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ మునిగిపోగా.. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం బోట్లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.అలా గెలవడం కంటే ఓడిపోవడమే మేలు.. Rishi sunak and liz truss: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేసే తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడం కంటే ఓడిపోవడం మేలని రిషి అభిప్రాయపడ్డారు.ఖర్చులు తగ్గించుకోవాలంటే.. ఇది ట్రై చేయండి!నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి అదనంగా రూ. 1000 - రూ.1500 ఖర్చు చేయడం పెద్దగా అనిపించదు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియకుండానే ఖర్చులను పెంచేస్తాయి. అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చక్కటి పరిష్కారం 30-రోజుల నియమం.ఆసియా కప్‌లో పరుగు వీరులు వీళ్లే.. Asia Cup Highest Run Scorer: 2022 ఆసియా కప్ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. 28న భారత్-పాక్ పోరుతో టోర్నీకి ఊపు రానుంది. భారత్ అత్యధికంగా ఏడు సార్లు కప్ గెలిచింది. మరి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది ఎవరో తెలుసా? ఇందులో టాప్-5లో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు. పాక్ నుంచి ఒక్కరు ఉన్నారు. ఆ టాప్-5 ఆటగాళ్లు సహా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో టైగర్ ష్రాఫ్ షికార్లు..Tiger shroff new girl friend hot gallery: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్-బోల్డ్ బ్యూటీ దిశాపటానీ కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. లవ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీ ఉన్న సమయంలో షికార్లు కొడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. అయితే ఈ జంట్ బ్రేకప్ చెప్పుకుందంటూ కొద్ది రోజులుగా తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ హీరో ఇప్పుడు మరో కొత్త భామ ఆకాంక్ష శర్మతో ప్రేమలో పడ్డాడని ప్రచారం మొదలైంది.