ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుసీజేఐగా జస్టిస్ ఉమేశ్ లలిత్ సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ యు.యు.లలిత్ (ఉదయ్ ఉమేశ్ లలిత్) భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జస్టిస్ లలిత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.రిజర్వేషన్ల అంశంపై సుప్రీం నోటీసులుఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టింది.బిహార్ సీఎంగా నీతీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం Bihar CM Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నీతీశ్‌తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి రేసులో లేనని నీతీశ్ స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వం పదవీ కాలం పూర్తికాకుండానే పతనమవుతుందని భాజపా నేత సుశీల్ మోదీ జోస్యం చెప్పారు.నుపుర్ శర్మకు ఊరట.. ఆ కేసులన్నీ దిల్లీకి బదిలీNupur Sharma news: భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నుపుర్ శర్మపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను దిల్లీ పోలీసులకు బదిలీచేయాలని సుప్రీం ఆదేశించింది. ప్రేమోన్మాది అరెస్ట్ నిన్న నల్గొండలో ఫారెస్ట్ పార్క్‌లో అమ్మాయిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది మీసాల రోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. గతంలోనూ నిందితుడు బాధితురాలిని సీసాతో బెదిరించాడని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్న్యూస్ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. నేటి నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 'ఆ మాత్రం రేవంత్‌రెడ్డికి తెల్వదా..' పాల్వాయి స్రవంతి ఆడియో వైరల్! palvai sravanthi audio viral: మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో ఎన్నికలవేడి మొదలైంది. అయితే ఇదిలా ఉండగా పాల్వాయి స్రవంతి ఆడియో కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యామాల్లో స్రవంతి ఆడియో హల్‌చల్ చేస్తోంది. ఎల్లుండి ఎంసెట్ ఫలితాల విడుదల..!EAMCET Results 2022: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాల విడుదలకు ముహుర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 12న లేదా 13న ఫలితాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఎంసెట్ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. ఆ తరువాత ఫలితాల ప్రకటనే.. విమాన టికెట్ ధరలకు ఇక రెక్కలు! Airfare bands: దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31న అమల్లోకి రానుందని తెలిపారు.సూర్య జోరు.. కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ICC Rankings Surya kumar yadav: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ-20 ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు.