తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @1PM - telangana latest updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news today till now
టాప్​టెన్ న్యూస్ @1PM

By

Published : Dec 29, 2020, 12:59 PM IST

  • రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్

సూపర్​స్టార్​ రజనీకాంత్​.. రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. ఆరోగ్యకారణల దృష్ట్యా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సరకు రవాణా కీలకం

దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు సరకు రవాణా కారిడార్లు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో నూతనంగా నిర్మించిన సరకు రవాణా కారిడార్లను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమెరికాలో నల్గొండ జిల్లా వాసి సజీవదహనం

అమెరికాలో నల్గొండ జిల్లా వాసి అనుమానాస్పదంగా మృతి చెందారు. కారులో మంటలు చెలరేగి దేవేందర్‌రెడ్డి(45) సజీవదహనమయ్యారు. దేవేందర్‌రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా దేవేందర్‌రెడ్డి పనిచేస్తున్నారు. తెరాస ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యుడిగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చిచ్చర పిడుగు..

తోటివారితో సరదాగా ఆడుకుంటూ గడపాల్సిన ఆ చిన్నారి మరణం అంచుల వరకూ వెళ్లాడు. చివరకు ప్రాణాలు దక్కినా రెండు చేతులు, రెండు కాళ్లూ లేకుండా జీవించాల్సి వచ్చింది. అయినా ఆ బాలుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా... చిత్రకారుడిగా మారాడు. నోటితో బొమ్మలు గీస్తూ ప్రముఖులను సైతం మెప్పిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ ముగ్గురికి పదేళ్లుగా అన్నీ ఆ గదిలోనే!

గుజరాత్​లోని రాజ్​కోట్​లో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. బాగా పెద్ద చదువులు చదువుకొన్న ఇద్దరు సోదరులు, వారి సోదరి పదేళ్ల పాటు ఇంట్లోని గదికి పరిమితం అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'లవ్ జిహాద్' ఆర్డినెన్స్

బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేలా రూపొందించిన మతస్వేచ్ఛ బిల్లును ఆర్డినెన్సు రూపంలో తీసుకొచ్చింది మధ్యప్రదేశ్. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రద్దైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గుర్తింపు కోసమే

అమెరికాలోని నాష్​విల్​లో క్రిస్మస్​ రోజు పేలుడుకు పాల్పడ్డ ఆంటోనీ క్విన్​ వార్నర్.. ఘటనకు కొద్ది రోజుల ముందు​ పొరుగు ఇంటి వ్యక్తి రిక్​ లౌడ్​తో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచం తనను మర్చిపోదని వార్నర్ అప్పుడు ఎందుకు అన్నాడో తనకు అర్థం కాలేదని చెప్పారు రిక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జనవరి 1 నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్!

వాట్సాప్ మరోసారి మిలియన్ల కొద్దీ పాత ఓఎస్​ ఫోన్లకు (యాపిల్​, ఆండ్రాయిడ్) జనవరి 1 నుంచి సేవలను నిలిపివేసేందుకు సిద్దమైంది. మరి ఏఏ ఫోన్లకు వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి? సేవలు నిలిచిపోనున్న ఫోన్ల జాబితాలో మీరు వాడుతున్న మోడల్ ఉందా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ ఘనత సాధించిన తొలి జట్టు భారత్

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​ ద్వారా పలు ఘనతల్ని కైవసం చేసుకుంది. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • షాహిద్​-విజయ్​ వెబ్​సిరీస్​ టైటిల్​ ఖరారు

రాజ్, డీకే సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్​సిరీస్​లో బాలీవుడ్​ హీరో షాహిద్​ కపూర్​, తమిళ నటుడు విజయ్​ సేతుపతి కలిసి నటించనున్నారు. మంగళవారం ఈ సిరీస్​ టైటిల్​ను 'గవర్'గా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details