తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 9PM - 9PM టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Aug 20, 2022, 8:58 PM IST

  • ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో, ఎవరికీ భయపడేది లేదన్న సీఎం కేసీఆర్

నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ధ్వజమెత్తారు. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదన్న సీఎం విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.

  • సీఎం కాన్వాయ్ రాకతో, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్

ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో నిర్వహిస్తున్న ప్రజాదీవెన సభకు వెళ్తున్నారు. 400 కార్లు ర్యాలీగా బయలుదేరగా సీఎం కాన్వాయ్ హబ్సీగూడ నుంచి మునుగోడు వెళ్తోంది. తెరాస శ్రేణుల కోలాహలంతో నగర రహదారులన్నీ సందడిగా మారాయి.

  • హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్ అవుతుందన్న కిషన్​రెడ్డి

రాష్ట్రంలో ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితి లేదని, మునుగోడు ఉప ఎన్నికలో భాజపా విజయం ఖాయమని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితమే మునుగోడులోనూ రిపీట్ అవుతుందన్నారు.

  • భాజపా, తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని రేవంత్​రెడ్డి ఫైర్

మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. రాజీనామా చేస్తే నిధులొస్తాయంటున్న భాజపా... వారి ఎంపీలను ఎందుకు రాజీనామా చేయించట్లేదని ప్రశ్నించారు.

  • ఒక్కసారి నమ్మి ఆదరించండి, ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తానన్న పవన్​

పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోందని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా సిద్ధవటం కౌలు రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్న పవన్ బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. జనసేనను ఒక్కసారి నమ్మి ఆదరిస్తే ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

  • టొమాటో ఫ్లూ డేంజర్ బెల్స్, చిన్నారులకే ముప్పు

భారత్​లో మరో వైరస్ కలకలం రేపుతోంది. టొమాటో ఫ్లూ అనే వైరస్ కేరళ, ఒడిశాలలో విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలకు సోకుతుందని ఓ అధ్యయనం తెలిపింది.

  • 2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంపై జరిగిన సీబీఐ దాడుల్లో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని భాజపా విమర్శించింది. ఈ దాడుల విషయంలో కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉంటారని ఆరోపించింది.

  • ఆ దేశ ప్రధానికి డ్రగ్స్​ పరీక్ష, మిత్రులతో పార్టీ చేసుకున్నందుకే

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్‌ పరీక్ష చేయించుకున్నారు.

  • సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ, కిడ్నాప్​ చేస్తానంటూ

ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సంగతులివీ.

  • రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ దూకుడు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టును గత మ్యాచ్​లో కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అయితే, తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయగా.. తాజాగా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ABOUT THE AUTHOR

...view details