ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు' ఎక్కడున్నా మాతృభూమిని మరవొద్దు' అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సదస్సులో పాల్గొనడానికి దుబాయ్‌కి వెళ్లిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను ఆదివారం అక్కడి తెలుగు అసోసియేషన్ గౌరవపూర్వకంగా సన్మానించింది. భారతీయులు ఎక్కడున్నా మాతృభాష, మాతృమూర్తి, స్వగ్రామాలను మరవొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారుఏ సీఎం స్థానం ఎవరికి? PM Modi: భాజపా విజయం సాధించిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న కసరత్తును ప్రధాని మోదీ సమీక్షించారు. జరుగుతున్న పరిణామాలను ఆయనకు హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. 'రైతులను మోసం చేసి కేంద్రంపై నెపం' తెలంగాణ సర్కార్ మోసాన్ని, కేసీఆర్ అబద్ధాలను గుర్తించిన రైతులు తెరాస నేతలపై తిరగబడతారన్న భయంతోనే కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొంటామని కేంద్రం చెబితే.. మేం ఇవ్వం అని చెప్పి.. ఇప్పుడు కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.200 కోట్ల ఆదాయంSouth Central Railway: రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వినూత్న విధానాలు, వస్తువుల సరఫరాలో కేంద్రీకృత విధానాలను పటిష్ఠంగా అమలు చేయడంతో దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రవాణాలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్సిల్స్‌లో 4.78 లక్షల టన్నుల లోడింగ్‌ను నిర్వహించి రూ.200 కోట్ల ఆదాయాన్ని జోన్ సాధించిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.వడ్రంగి టాలెంట్.. చూడ 'చెక్క'గా ట్రెడ్‌మిల్ టి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామశాల వైపు పరుగులు పెడుతున్నారు. కొందరు ఇంటి దగ్గరే ఉండి వ్యాయామం చేస్తే మరికొందరు యోగా కేెంద్రాలకు, వ్యాయామశాలకు వెళ్తున్నారు. అయితే వీటన్నింటికి డబ్బు అధికంగానే ఖర్చు అవుతోంది. సీఆర్‌డీఏకు నోటీసులిచ్చిన అమరావతి రైతులుAmaravati Farmers : సీఆర్‌డీఏ, రెరాకు అమరావతి రైతులు నోటీసులిచ్చారు. నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు ఆలస్యానికి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రెరా సుమోటోగా సీఆర్‌డీఏనే తమ పరిధిలోకి తీసుకోవాలని రైతులు కోరారు.బధిర మహిళను బంధించి.. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ బధిర మహిళను.. దుండగులు కిడ్నాప్ చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. కిడ్నాపర్లు మహిళ కుటుంబసభ్యులకు.. ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానని, ఓ మహిళ ఇక్కడ ఉందని తెలిపాడు. మతి స్థిమితంలేని చిన్నారిపై అత్యాచారంChild Rape News: మతిస్థిమితం లేని ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బాలికను అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.పల్లెటూరి కథలతో వెబ్ సిరీస్ Satish Vegesna New Web Series: ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్.. తొలిసారి ఓటీటీ కోసం ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. పల్లెటూరి కథలతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు 'కథలు.. మీవి మావి' అనే టైటిల్ ఖరారు చేశారు.' ఆ నలుగురు అస్సలు కంగారు పడరు'Pat Cummins: బంతిపై ఉమ్ము రాయడంపై శాశ్వత నిషేధం పేసర్లకు ఇబ్బంది కాబోదన్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాటింగ్ స్టైల్‌పై కూడా స్పందించాడు.