రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని శుక్రవారం కూకట్‌పల్లి, కేపీహెచ్బీ కాలనీలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్థులకు బీ-ఫారం అందజేశారు. విజన్ 2020 లక్ష్యంతో హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబునాయుడు అభివృద్ధి చేశారని సుహాసిని తెలిపారు. పేదలకు ఇచ్చిన హామీలను తెరాస నెరవేర్చలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేదని విమర్శించారు.
ఆరుగురు తెదేపా అభ్యర్థులకు బీ-ఫారం అందజేత - టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత హైదరాబాద్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తదేపా తరఫున పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు సుహాసిని బీ-ఫారం అందజేశారు. పేదలకు ఇచ్చిన హామీలను తెరాస నెరవేర్చలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేదని విమర్శించారు. అభివృద్ధి కోసం గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని సుహాసిని కోరారు.
ఆరుగురు తెదేపా అభ్యర్థులకు బీ-ఫారం అందజేత
అలాగే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని, అర్హులైన పేదలకు రూ. 10 వేల సహాయం అందలేదని ఆరోపించారు. భాజపా అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వస్తాయని అసత్యాలు చెప్పిందన్నారు. అభివృద్ధి కోసం గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని సుహాసిని కోరారు.
ఇదీ చదవండి:ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు
Last Updated : Nov 20, 2020, 9:33 PM IST