హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఎస్టీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలంలోని పేదల భూమిని బడా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని విన్నవించింది. దళిత రైతులకు సంబంధించి వందల ఎకరాల భూమిని ఓ బడా కంపెనీకి అప్పగించే కుట్ర జరుగుతోందని తెదేపా నేతలు వివరించారు.
దళితులు, గిరిజనుల భూములను కాపాడండి: తెదేపా - telangana tdp leaders meet sc st chairman at basheerbagh
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ని తెదేపా నేతలు కలిశారు. సూర్యాపేట జిల్లాలోని దళిత, గిరిజనులకు చెందని భూ సమస్యను పరిష్కరించాలని కోరారు.
![దళితులు, గిరిజనుల భూములను కాపాడండి: తెదేపా telangana tdp leaders meet sc st welfare chairmen at basheerbagh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10340927-362-10340927-1611321164861.jpg)
'వందల ఎకరాల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు'
మఠంపల్లిలోని గిరిజనులకు సంబంధించిన 1,876 ఎకరాల భూమిని సైతం కాపాడాలని కోరారు. తక్షణమే స్పందించిన ఛైర్మన్.. సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
ఇదీ చూడండి: 'పరిహారం ఇవ్వలేదు.. పనుల్లో నాణ్యతలేదు'