తెలంగాణ

telangana

ETV Bharat / city

covid hospitals: కరోనా వైద్యానికి ఈ ధరలు సరిపోవు! - black fungus

కరోనా వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు(covid charges) సరిపోవని తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(Telangana super speciality hospitals association) పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటిని సవరించాలని సర్కారుకు విజ్ఞప్తి చేసింది. స్పందించిన వైద్యఆరోగ్య శాఖ... త్వరలోనే పెంపునకు సంబంధించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కరోనా వైద్యానికి ఈ ధరలు సరిపోవు!
కరోనా వైద్యానికి ఈ ధరలు సరిపోవు!

By

Published : May 29, 2021, 7:23 AM IST

ప్రైవేటు ఆసుపత్రు(private hospital)లలో వైద్యం కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలు(covid charges) హేతుబద్దంగా లేవని, సరిపోవని తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(telangana super speciality hospitals association) ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్ తిచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటిని సవరించాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి, త్వరలోనే ధరల సవరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయన్న నిర్ణయానికి వచ్చిన వైద్యఆరోగ్య శాఖ త్వరలోనే పెంపునకు సంబంధించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

బ్లాక్‌ఫంగస్‌ మందుల తిప్పలు తప్పించేందుకు
బ్లాక్‌ ఫంగస్‌(black fungus) మందుల కోసం ఇప్పుడు రోగి బంధువులు తిరగాల్సి వస్తోంది... దీన్ని తప్పించి ఆ బాధ్యతలను ఆసుపత్రికే అప్పగించే ఆలోచనతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఫారం నింపి రోగి చికిత్స పొందుతున్న ఆసుపత్రితో ధృవీకరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపాలి. మందులు మంజూరు చేసిన తర్వాత సంబంధిత స్టోర్‌ రూంకు వెళ్లి తెచ్చుకోవాలి. దీనివల్ల రోగి బంధువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి నోడల్‌ ఆఫీసర్‌ కంపెనీకి వచ్చి మందులు తీసుకెళ్లే విధంగా నిబంధనలు సవరించాలని ఆరోగ్యశాఖ యోచిస్తోంది.

ఇదీ చూడండి:

license cancel: ప్రైవేటులో అధిక బిల్లుల వసూళ్లపై సర్కారు కన్నెర్ర

ABOUT THE AUTHOR

...view details