కేంద్ర ప్రభుత్వ లాక్డౌన్ ఆదేశాలతో ఏపీలో ఉండిపోయిన రాష్ట్ర విద్యార్థులను అధికారులు వారి స్వస్థలాలకు పంపుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇరుక్కుపోయిన 610 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించారు. తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి , మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలు స్పందించి విద్యార్థులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమం చేశాయి. ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో వారిని రాష్ట్రానికి పంపించినట్లు నంద్యాల ఆర్డీవో తెలిపారు.
నంద్యాల నుంచి రాష్ట్రానికి పయనమైన విద్యార్థులు
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో తెలంగాణకు చెందిన 610 మంది బ్యాంకు కోచింగ్ విద్యార్ధులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. పరీక్షల శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు లాక్డౌన్ సందర్భంగా నంద్యాలలోనే ఉండి పోయారు.
నంద్యాల నుంచి రాష్ట్రానికి పయనమైన విద్యార్థులు