సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రవితో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొని సీపీఎస్ విధానానికి నిరసనగా ఆందోళన చేశారు.
'సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి' - Telangana State United Teachers Federation demands to Abolish CPS policy
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
దేశవ్యాప్తంగా సీపీఎస్ విధానం అమల్లో ఉందని, పాలకపక్షాలు.. ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని రవి ఆరోపించారు. వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానం రద్దు కోసం 16 ఏళ్లుగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని సంఘాలు కలిసి పాలకులపై ఐక్యంగా పోరాడితేనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమవుతాయని రవి స్పష్టం చేశారు.