రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించిన తెలంగాణ గణాంక వివరాల పుస్తకాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలు, పలు సర్వే గణాంక సమాచారం, సాధించిన ప్రగతి వివరాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ దైనందిన పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర ఎంతో కీలకమని.. ప్రతి శాఖకు దిక్సూచిగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ, సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమగ్ర సమాచారాన్ని tsdps.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు.
ప్రతి శాఖకు దిక్సూచిగా నిలుస్తుంది: వినోద్ కుమార్ - planing commission news
తెలంగాణ గణాంక వివరాల పుస్తకాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ, సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ఆయా సమావేశాల్లో విధిగా ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలన్నారు.
ప్రజా ప్రతినిధులు విధిగా దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆయా సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలని వినోద్ కుమార్ సూచించారు. గ్రామ స్థాయి సమగ్ర సమాచారంతో ప్రత్యేకంగా పుస్తకాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్ అట్లాస్పై దృష్టి సారించాలన్నారు. అన్ని శాఖలకు ఉపయోగపడేలా పుస్తకాన్ని ప్రచురించినట్లు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామ స్థాయి సమాచారంతో పుస్తకాన్ని తీసుకొస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు