తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @9AM - telangana top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana state news today till now
టాప్​టెన్ న్యూస్​ @9AM

By

Published : Jan 7, 2021, 9:00 AM IST

  • అజాగ్రత్తగా ఉంటే ముప్పే..

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న క్రమంలో కేసుల నమోదులో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. బాధితుల సంఖ్య ఉన్నట్టుండి దాదాపు 30-40 శాతం పెరగడం ప్రమాద సూచికేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తొలిదశలోనే మాకూ ఇవ్వండి

రాష్ట్రానికి త్వరలో కొవిడ్‌ టీకాలు రానున్న నేపథ్యంలో.. తొలి దశలోనే వాటిని పొందడానికి వివిధ వర్గాల వారు ప్రయత్నిస్తున్నారు. క్లినిక్‌లు, ప్రైవేటు పరిశ్రమలు తదితర చోట్ల పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది సహా ఆర్‌ఎంపీలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు తొలిదశలోనే తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏవీ సుబ్బారెడ్డికి 41సీఆర్​పీసీ కింద నోటీసులు

సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మరోవైపు భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ రెండు వర్గాలు ఒక్కటయ్యాయా?

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డికి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు నడుస్తున్నాయి. అయితే ఓ స్థల విషయంలో ఇరు వర్గాలు ఒక్కటయ్యాయా? అనే అనుమానాలు వస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ ఊరు 27 పతకాలు తెచ్చిపెట్టింది

భారత్‌కు 14 మంది ఒలంపిక్ ఆటగాళ్లను అందించిన ఊరది. మనదేశానికి 27పతకాలు సాధించిపెట్టిన ఆటగాళ్లను పెంచిన గ్రామమది. హాకీ మక్కాగా పేరుపొందిన ఈ ఊరు.. క్రీడాకారులకు ప్రస్తుతం సరైన ఆట మైదానం అందించడంలో వెనబడుతోంది. భారత హాకీని ప్రపంచస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఈ ఊరి మైదానం కీలకపాత్ర పోషించింది. ఇంతకీ ఆ ఊరేది? దాని చరిత్ర ఏంటి? ఓ సారి తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సశక్త దేశానికి ప్రతీక

భారత పార్లమెంటు విశిష్టతను పదిలంగా కాపాడుకుంటూనే దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం నాటికి కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి మోదీ సర్కారు సంకల్పించింది. పార్లమెంటు సభ్యుల సంఖ్య స్థిరీకరణ 2026తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం 888 మంది సభ్యుల్ని దృష్టిలో ఉంచుకొని లోక్‌సభను తీర్చిదిద్దుతోంది. అదే రాజ్యసభలో 384 మంది కూర్చోగలిగేలా తలపెట్టిన కార్యాచరణలో- వందేళ్ల అవసరాల మదింపు హేతుబద్ధంగా జరిగిందా? లేదా? అన్నది పునరాలోచించాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బర్డ్‌ ఫ్లూ కలకలం

కరోనా మహమ్మారితో ఇప్పటికే దేశం అతలాకుతలమై అల్లాడుతుంటే.. బర్డ్​ ఫ్లూ కోరలు చాస్తూ.. పౌల్ట్రీ పరిశ్రమకు పెనుసవాళ్లు విసురుతోంది. 15 ఏళ్ల క్రితమే దేశంలోకి విస్తరించిన ఈ వైరస్.. ఇప్పటికే 28సార్లు పంజా విసిరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్​ ఫ్లూతో 4 రాష్ట్రాల పరిధిలో వేలాదిగా పక్షులు మృత్యువాతపడ్డాయి. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో కాకులు.. హిమాచల్​ ప్రదేశ్​, కేరళల్లో బాతులు ఎక్కువగా చనిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రణరంగంలా ..

రిపబ్లికన్​ మద్దతుదారుల ఆందోళనతో అమెరికా క్యాపిటల్​ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి ​ మద్దతుగా క్యాపిటల్​ వద్ద నిరసన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. కొంత మంది పోలీసులపై పెప్పర్​ స్ప్రే చల్లారు. ఈ క్రమంలో నిరసనకారులను నిలువరించేందుకు తుపాకుల మోత మోగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సచిన్​ వందో సెంచరీ..

దిగ్గజం సచిన్.. శతశతకాలతో ఎవరికీ సాధ్యమవని రికార్డు నెలకొల్పారు. అయితే ఆ ఘనత సాధించాక క్రీజులో తనతో పాటు బ్యాటింగ్​ చేస్తున్న రైనాతో మాస్టర్​ ఏమన్నాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'వకీల్​సాబ్' ఫొటోలు లీక్!

పవన్​ కొత్త సినిమా క్లైమాక్స్​ ఫైట్​ ఫొటోను నటుడు దేవ్​గిల్​ తన ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details