తెలంగాణ

telangana

ETV Bharat / city

థర్మల్‌ వెలుగుల్లో తెలంగాణ నంబర్ వన్ - thermal power production in telangana

థర్మల్‌ విద్యుదుత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తిని రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్పత్తి సామర్థ్యంలో 70.66 శాతం ఉత్పత్తితో తెలంగాణ జెన్‌కో అగ్రస్థానంలో, 58.33 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో మూడో స్థానంలో నిలిచాయి.

telangana state is at number one position in thermal electricity production
థర్మల్‌ వెలుగులు

By

Published : May 14, 2020, 5:25 AM IST

Updated : May 14, 2020, 6:18 AM IST

థర్మల్‌ విద్యుదుత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. విద్యుత్‌ సంస్థల వారీగా చూసినప్పుడు 87.54 శాతంతో సింగరేణి విద్యుత్కేంద్రం గతేడాది మాదిరే దేశంలోనే అగ్రగామిగా ఉంది. థర్మల్‌ విద్యుదుత్పత్తి పరంగా 2018-19లో ఒడిశా మొదటి స్థానంలోను, తెలంగాణ రెండో స్థానంలోను నిలవగా ఈసారి ఒడిశా స్థానాన్ని తెలంగాణ అందిపుచ్చుకుంది.

ఉత్పత్తి పరంగా అటు సంస్థల్లో సింగరేణి, ఇటు రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు ‘కేంద్ర విద్యుత్‌ మండలి’(సీఈఏ) తాజా నివేదిక(2019-20)లో ప్రకటించింది.

తెలంగాణలో ఉన్న అన్ని థర్మల్‌ కేంద్రాల స్థాపిత ఉత్పాదక సామర్థ్యం 3382.50 మెగావాట్లు కాగా గతేడాది అందులో సగటున 70.66 శాతం ఉత్పత్తి జరిగింది.

ఇలాగే ఏపీ మొత్తం సామర్థ్యం 3,410 మెగావాట్లకు 58.33 శాతం ఉత్పత్తి జరిగింది.

2018-19లో దేశవ్యాప్తంగా థర్మల్‌ కేంద్రాల సగటు వార్షిక ఉత్పత్తి శాతం 57.16 ఉండగా 2019-20లో దానిని 58.24 శాతానికి పెంచాలని కేంద్ర విద్యుత్‌శాఖ లక్ష్యాన్ని పెట్టింది. చివరికి జాతీయస్థాయిలో 50.24 శాతానికే పరిమితమైంది.

తెలంగాణతో పోలిస్తే గుజరాత్‌లో థర్మల్‌ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 70శాతం ఎక్కువ.
అక్కడ థర్మల్‌ విద్యుదుత్పత్తి తగ్గడానికి సౌర, పవన విద్యుత్‌ వంటి ‘సంప్రదాయేతర ఇంధన’(ఆర్‌ఈ) ఉత్పత్తి పెరగడంవంటి కారణాలున్నాయి.

తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులుండటం థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు వరంగా మారింది. గతేడాది మే నుంచి అక్టోబరు దాకా దేశవ్యాప్తంగా థర్మల్‌ కేంద్రాలకు తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. కానీ సింగరేణి బొగ్గుతో తెలంగాణ ప్లాంట్లకు కొరతనేదే రాలేదు.

తెలంగాణలో కరెంటు రోజువారీ గరిష్ఠ డిమాండు రికార్డు స్థాయిలో 13,168 మెగావాట్లకు చేరడం విద్యుదుత్పత్తి పెరగడానికి మరో కారణమని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు.

ఏపీ థర్మల్‌ కేంద్రాలకు దూరప్రాంతాల నుంచి బొగ్గు సరఫరా సరిగాలేక కరెంటు ఉత్పత్తి 58.33 శాతానికే పరిమితమైంది.

ప్రజల వార్షిక తలసరి కరెంటు వినియోగంలో 2018-19లో గుజరాత్‌ తరువాత తెలంగాణ 1896 యూనిట్లతో రెండోస్థానంలో, ఏపీ 1480 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచాయి.

Last Updated : May 14, 2020, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details