రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ను మరింత ప్రమోట్ చేసేలా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. కామారెడ్డి జిల్లాలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 15 ఎకరాల ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ఈ ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతగానో తోడ్పడుతుందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు అగస్త్యాతో టీఎస్ఐసీ ఒప్పందం - తెలంగాణ స్టేట్ ఇన్నేవేషన్ సెల్
కామారెడ్డిలో ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అగస్త్యా, ప్రవాహ ఫౌండేషన్‌తో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ప్రారంభించాలనుకునేవారికి ఈ క్యాంపస్ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు అగస్త్యాతో టీఎస్ఐసీ ఒప్పందం
రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో అందుబాటులోకి రానున్న క్యాంపస్ ద్వారా మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల యువత నైపుణ్యాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతుందని తెలిపారు. జౌత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ప్రారంభించాలనుకునేవారికి ఈ క్యాంపస్ వెన్నుదన్నుగా నిలుస్తుందని జయేష్ వెల్లడించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో తగ్గిన కేంద్ర పథకాల నిధుల వ్యయం