తెలంగాణ

telangana

ETV Bharat / city

కాలం చెల్లిన వాహనాలపై రాష్ట్ర సర్కార్ దృష్టి - State government focus on obsolete vehicles

కాలం చెల్లిన వాహనాలు ప్రజల ఆరోగ్యానికి పొగ బెడుతున్నాయి. అందుకే కేంద్ర సర్కారు కాలం చెల్లిన వాహనాలపై దృష్టిసారించింది. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాల లెక్కలు తీస్తోంది. తాజాగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో దేశవ్యాప్తంగా 4 కోట్ల వాహనాలున్నాయి. అందులో 2 కోట్లకుపైగా వాహనాలు 20 ఏళ్లకుపైబడినవే అని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అప్రమత్తమై తెలంగాణలో 20ఏళ్లు దాటిన వాహనాల లెక్కలు తీస్తున్నారు.

outdated vehicles, outdated vehicles  in Hyderabad, outdated vehicles in telangana
తెలంగాణలో కాలం చెల్లిన వాహనాలు, హైదరాబాద్​లో కాలం చెల్లిన వాహనాలు

By

Published : Apr 5, 2021, 12:02 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నాయి. అందులో సగానికి పైగా వాహనాలు గ్రేటర్‌ పరిధిలోనే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సుమారు 13 లక్షల వరకు, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు సుమారు 2.58 లక్షల వరకు ఉన్నట్లు రవాణాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వాటికి సంబంధించిన వివరాలు విడుదల చేసింది.

కర్ణాటకలోనే అధికం..

దేశవ్యాప్తంగా 4 కోట్ల వాహనాలలో 2 కోట్లకుపైగా వాహనాలు 20 ఏళ్లకు పైగా తిరిగినవేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో అత్యధికంగా పాత వాహనాలను కలిగిన రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో ఏకంగా 70 లక్షల పైచిలుకు పాత వాహనాలున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 59.93 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 56.54 లక్షల పాత వాహనాలు ఉన్నాయి. 15, 20ఏళ్లు పైబడిన వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో 15.58 లక్షల పైచిలుకు ఉన్నాయని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

గ్రీన్ టాక్స్..

ప్రస్తుతం కాలుష్య నివారణలో భాగంగా రాష్ట్రంలో 8 ఏళ్లకు పైబడిన రవాణా వాహనాలకు రవాణాశాఖ గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. రవాణా వాహనాలకు వాహనాన్ని బట్టి గ్రీన్ టాక్స్ ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ వసూలు చేస్తారు. 15 ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయి. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేస్తారు. 15ఏళ్ల తర్వాత అదనపు ఐదేళ్ల వరకు మోటారు సైకిల్ కు 250, కార్లకు 500 రూపాయలు గ్రీన్ టాక్స్ కింద వసూలు చేస్తారు. వాహనాలు రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రోజు నుంచి 15 ఏళ్ల పాటు జీవితకాలం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత వాహన ఇంజిన్‌ సామర్థ్యం తగ్గిపోయి కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనల ప్రకారం పరిమితికి మించి కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ఈ క్రమంలో ఆ వాహనాలను రవాణాశాఖ కార్యాలయంలో సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పరిమితికి లోబడే కాలుష్య కారకాలను వెలువరిస్తుందని వెల్లడైతేనే ఆ వాహనానికి గ్రీన్‌ ట్యాక్స్ చెల్లించి రోడ్డుపైకి రావాల్సి ఉంటుంది.

ఇంకా రాలేదు..

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న గ్రీన్ ట్యాక్స్ నూతన విధివిధానాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని..అవి వచ్చిన తర్వాత వాటిని అమలుచేస్తామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 15, 20 ఏళ్లు దాటిన వాహనాల గణాంకాలు మాత్రం తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.

కాలం చెల్లిన వాహనాలపై రాష్ట్ర సర్కార్ దృష్టి

ABOUT THE AUTHOR

...view details