జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఫొటోతో కూడిన ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై చర్చించారు. అర్హులైన వారు ఆన్లైన్లో, లేదా ఆఫ్లైన్లో ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించింది. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు లేదా సవరణలను డిప్యూటీ కమిషనర్లు చేయకూడదని పార్థసారధి సూచించారు.
జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి: కమిషనర్
అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఓటర్ల జాబితాలో గల ఓటర్లందరిని వార్డుల వారీగా పునర్వ్యవస్థీకరించాలన్నారు.
జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి
పోలింగ్ కేంద్రాల కోసం ముందస్తుగానే భవనాలు గుర్తించాలని... ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ ఆయా వార్డు పరిధిలోనే ఏర్పాటు చేయాలని.. సాధ్యమైనన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ డోర్స్ వేరుగా ఉండేట్లు చూడాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో భాగస్వామి కావాలని తెలిపారు.
ఇవీచూడండి:ఈ నెల 4 నుంచి గ్రేటర్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్