గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు ఇతర స్థానిక సంస్థల్లోని ఖాళీలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం విధిగా అమలు చేయాలని తెలిపింది. నామినేషన్ల దాఖలు, ప్రచార సందర్భంగా కూడా నిబంధనలను పూర్తిగా పాటించాలని స్పష్టం చేసింది.
నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఎస్ఈసీ ఆదేశం - నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఎస్ఈసీ ఆదేశం
రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ఇతర స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్న నెపథ్యంలో ఎస్ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణతో పాటు అభ్యర్థులు పాటించవలసిన నియమాలను సూచించింది.
నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఎస్ఈసీ ఆదేశం
ఐదుగురు మాత్రమే కలిసి ఇంటింటి ప్రచారం చేయాలని, వాహనాల కాన్వాయ్ ఉంటే ప్రతి రెండు వాహనాలకు మధ్య దూరం ఉండాలని తెలిపింది. అభ్యర్థులు వీలైనంత వరకు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేయాలని ఎస్ఈసీ సూచించింది. అటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోనూ స్వల్ప సవరణలు చేసింది. ఏదైనా జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగితే ఇప్పటి వరకు సంబంధిత రెవెన్యూ డివిజన్ అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండేది. దాన్ని కేవలం సదరు మండల పరిషత్‌కు మాత్రమే కుదిస్తూ సవరణ చేశారు.