రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. నిన్న 50 కేసులు నమోదవగా... ఇవాళ మరో 66 కేసులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 46 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రకటించారు. వీరందరిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తాజా కేసులతో హైదరాబాద్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య 404కు చేరింది.
రాష్ట్రంలో ఇవాళ 66 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ తాజాగా మరో 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో 30 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మరో 15 కేసులు సూర్యాపేట జిల్లాలో, 3 కేసులు ఆదిలాబాద్ జిల్లాలో రాగా... గద్వాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. మంచిర్యాలలో తొలి కేసు రావడం కలకలం పుట్టిస్తోంది.
సూర్యాపేట జిల్లాలోనూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 15 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఏకంగా 16 కేసులు బయటపడగా... ఇవాళ మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల సంఖ్య 54కు చేరిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ జిల్లాలో మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటయ్యాయి.
మంచిర్యాలలో తొలి కేసు
ఆదిలాబాద్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 14కు చేరింది. మంచిర్యాల జిల్లాలో తొలిసారి ఓ పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ ప్రకటించారు. అటు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో పాజిటివ్ కేసు వచ్చిందని డీఎంహెచ్వో ప్రకటించారు. గద్వాల జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరింది.