తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - లాక్​డౌన్​పై తెలంగాణ మంత్రివర్గ సమావేశం

cm kcr
cm kcr

By

Published : May 17, 2020, 8:41 PM IST

Updated : May 17, 2020, 9:29 PM IST

20:40 May 17

రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రిమండలి సమావేవం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించడం, రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ తీరుతెన్నులు, కరోనా కేసుల పెరుగుదల, వైరస్​ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.  

లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్​లో చర్చించనున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది

Last Updated : May 17, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details