- మొత్తం బడ్జెట్ రూ.1,82,914 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
- పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లు
- రెవెన్యూ మిగులు రూ.4,482.18 కోట్లు
- ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు
- రైతు రుణమాఫీకి రూ.6,225 కోట్లు
- రైతుబంధు కేటాయింపులు రూ.14 వేల కోట్లు
- రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు
- సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు
- బిందు, తుంపర సేద్యానికి రూ.600 కోట్లు
- మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ.1000 కోట్లు
- పశు సంవర్థక శాఖకు కేటాయింపులు రూ.1586.38 కోట్లు
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం రూ.23,005 కోట్లు
- మున్సిపల్ శాఖకు కేటాయింపులు రూ.14,809 కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
- విద్యుత్ శాఖకు రూ.10,416 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.11,758 కోట్లు
- ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.16,534.97 కోట్లు
- ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9,771.27 కోట్లు
- మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ.1,518.06 కోట్లు
- పాఠశాల విద్యాశాఖకు రూ.10,421 కోట్లు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ కోటా మొత్తం రూ.2,650 కోట్లు
- ఉన్నత విద్యాశాఖకు రూ.1,723.27 కోట్లు
- వైద్య రంగానికి రూ.6,186 కోట్లు
- వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ.4,356.82 కోట్లు
- కల్యాణలక్ష్మి, బీసీల కోసం అదనపు నిధుల మొత్తం రూ.1,350 కోట్లు
- ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు
- మహిళా సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1,200 కోట్లు
- పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు
- పారిశ్రామిక రంగ పోత్సాహకాలకు రూ.1,500 కోట్లు
- ఆర్టీసీకి రూ.1000 కోట్లు
- గృహ నిర్మాణం(డబుల్ బెడ్ రూం) కోసం రూ.11,917 కోట్లు
- అటవీ, పర్యావరణ శాఖలకు రూ.791 కోట్లు
- దేవాలయాల అభివృద్ధి, పూజల కోసం రూ. 550 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ.3,494 కోట్లు
- పోలీసు శాఖకు రూ.5,852 కోట్లు
- కలెక్టరేట్లు, పోలీసు కమాండ్ సెంటర్ నిర్మాణాలకు రూ.550 కోట్లు
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక బడ్జెట్ రూ.1,82,914.42 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. వాస్తవిక దృక్పథంతోనే పద్దు రూపకల్పన చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని స్పష్టం చేశారు.
telangana budget 2020
ఇదీ చూడండి:తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు
Last Updated : Mar 8, 2020, 7:10 PM IST