తెలంగాణ

telangana

ETV Bharat / city

డ్రోన్ పైలెటింగ్​లోనూ శిక్షణ అందిస్తోన్న తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ - డ్రోన్ పైలెటింగ్​లో శిక్షణ అందిస్తున్న టీఎస్​ఏఏ

Telangana state aviation academy: కొత్తగా తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెటింగ్​లోనూ శిక్షణ అందిస్తోంది. ఇప్పటి వరకు శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది విద్యార్థులను పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సన్మానించారు. ట్రైయినింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్​తో పాటు డీజీసీఏ ద్వారా డ్రోన్ పైలెట్లుగా గుర్తింపు లభిస్తుంది.

Telangana state aviation academy
తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ

By

Published : Mar 10, 2022, 10:06 PM IST

Telangana state aviation academy: డ్రోన్ పైలెటింగ్ విభాగంలో విద్యార్థులు, జౌత్సాహిక ప్రొఫెషనల్స్​కు శిక్షణనిచ్చేందుకు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ముందుకొచ్చింది. ఏవియేషన్ ఫీల్డ్​లో పైలెట్లకు వరల్డ్ క్లాస్ శిక్షణనిస్తోన్న తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ.. నూతనంగా డ్రోన్ పైలెటింగ్​లోనూ శిక్షణను అందిస్తోంది.

శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు..

మొదటి రెండు బ్యాచ్​లలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇక్రిసాట్​కు చెందిన పలువురు శాస్త్రవేత్తలకు శిక్షణను అందించిన టీఎస్ఏఏ.. తాజాగా విద్యార్థులు, ఔౌత్సాహిక ఎంటర్​ప్రినర్లకు డ్రోన్ల ఆపరేషన్​లో శిక్షణను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు బ్యాచ్​ల ద్వారా 70 మంది టీఎస్ఏఏ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్నారు. అలా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సన్మానించారు. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ద్వారా డ్రోన్ పైలెటింగ్ లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్​తో పాటు డీజీసీఏ ద్వారా డ్రోన్ పైలెట్లుగా గుర్తింపు లభిస్తుంది.

ఈ శిక్షణలో ఐదురోజుల పాటు డ్రోన్ ఉపకరణాలు, సాఫ్ట్​వేర్, సిములేటర్లు, మార్గదర్శకాలు, ఫ్లైయింగ్ మెళకువలపై అవగాహనను టీఎస్ఏఏ కల్పిస్తుంది. హైదరాబాద్​కు చెందిన మారుట్ డ్రోన్స్ స్టార్టప్ భాగస్వామ్యంతో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు

ఇదీ చదవండి:BJP Celebrations: భాజపా కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం.. అంబరాన్నంటిన సంబురాలు..

ABOUT THE AUTHOR

...view details