తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒకటి, రెండు రోజుల్లో పదోతరగతి ఫలితాలు - తెలంగాణ తాజా వార్తలు

పదో తరగతి ఫలితాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది.

telangana ssc results
telangana ssc results

By

Published : May 20, 2021, 4:56 AM IST

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి, గ్రేడ్లు ఖరారు చేయాలని ఆదేశిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్ష రుసుం చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది.

ఫలితాల విడుదలకు మంత్రి ఆమోద ముద్ర వేయడం వల్ల.. మార్కుల అప్​లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీచూడండి:విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులు.. నేడో, రేపో ఉత్తర్వులు..!

ABOUT THE AUTHOR

...view details